Former Minister Danam Nagendar Warns To Telangana Govt Ministers | Congress Party Dharna

Danam nagendar warns telangana govt ministers

danam nagendar news, danam nagendar controversy, telangana govt ministers, trs mla balaraju attack, congress dharna, telangana congress party

Danam Nagendar Warns TRS Party Ministers : Former Minister Danam Nagendar Warns To Telangana Govt Ministers.

‘టీఆర్ఎస్ నేతలూ.. ఒళ్లు దగ్గర పెట్టుకోండి’

Posted: 09/07/2015 12:58 PM IST
Danam nagendar warns telangana govt ministers

అప్పుడప్పుడు తెరముందు కనిపించి సంచలన వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, మాజీమంత్రి దానం నాగేందర్.. తాజాగా తన ఘాటు పదజాలంతో కూడిన హెచ్చరికలను తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నేతలకు జారీ చేశారు.

ఇటీవల పాలమూరు జడ్పీ సమావేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి చేసిన విషయం తెలిసిందే. వారిద్దరి మధ్య వాగ్యుద్ధం నెలకొనగా ఒకరికొకరు తీవ్రంగా తిట్లు సంధించుకున్నారు. ఈనేపథ్యంలోనే రామ్మోహన్ చెంపపై బాలరాజు ఛళ్లుమనిపించారు. ఈ దాడికి నిరసనగా టీ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. ఈ సందర్భంగానే హైదరాబాదులో జరిగిన ఆందోళనలో పాల్గొన్న దానం నాగేందర్.. అధికార పార్టీ నేతల వైఖరిపై నిప్పులు చెరిగారు.

‘టీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించాలి. లేకపోతే అధికారం పోయాక వారికీ ఇబ్బందులు తప్పవు. కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేతలు వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఈ దాడులను ఇక ఎంతమాత్రం సహించేది లేదు’ అని దానం ధ్వజమెత్తారు. మరి.. ఈయన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : danam nagendar  telangana congress party  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more