Vs ramadevi biography first indian women chief election commission

vs ramadevi biography, vs ramadevi life story, vs ramadevi history, vs ramadevi wikipedia, vs ramadevi wiki telugu, vs ramadevi photos, vs ramadevi biodata, vs ramadevi family members

vs ramadevi biography first indian women chief election commission : The Biography of vs ramadevi who is the first indian women who works as chief election commission and also governor for two states.

భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్

Posted: 02/20/2015 04:47 PM IST
Vs ramadevi biography first indian women chief election commission

స్త్రీలు కేవలం ఇంట్లోనే వుండాలి.. బయటకు రాకుండా ఇంటిపట్టునే వుంటూ అన్ని పనులు నిర్వహించుకోవాలి.. అనే సమాజం నుంచి చీల్చుకునివచ్చిన ఎందరో మహిళాప్రతిభావంతులు తమ సత్తా చాటుకున్నారు. పురుషులకంటే తాము ఏమాత్రం తీసుకుపోమంటూ వారికి ధీటుగా నిలుస్తూ అన్నిరంగాల్లోనూ పాలుపంచుకున్నవారున్నారు. అటువంటివారిలో వి.ఎస్.రమాదేవి కూడా ఒకరుగా భావించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక సాధారణ స్థాయి నుంచి అందనంత ఎత్తుకు ఎదిగిన ఈమె.. మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ గా దేశ చరిత్రలో నిలిచిపోయారు. అంతేకాదు.. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కొన్నాళ్లపాటు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.

జీవిత చరిత్ర :

1934 జనవరి 15వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలులో వి.వి.సుబ్బయ్య - వి. వెంకట రత్నమ్మ దంపతులకు రమాదేవి జన్మించారు. బాల్యం నుంచి చాలా చురుగ్గా అన్ని వ్యవహారాల్లోనూ పాలుపంచుకునే ఈమె.. ఏలూరు, హైదరాబాద్ నగరాల్లో ఎమ్.ఎ., ఎల్.ఎల్.ఎమ్. పూర్తిచేశారు. అందులో పట్టాపొందిన అనంతరం ఆమె 1959లో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఇండియన్ లీగల్ సర్వీసులో నియుక్తులై వివిధ హోదాలలో పనిచేశారు. లెజిస్లేటివ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, లా కమిషన్ మెంబర్ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే కస్టమ్స్ ఎక్సైజు అప్పీళ్ల ట్రిబ్యునల్ సభ్యులుగా పనిచేశారు.

ఈ క్రమంలోనే ఆమె 1993లో ప్రధాన ఎన్నికల కమీషనరుగా కొంతకాలం పనిచేశారు. ఈ విధంగా బాధ్యతలు చేపట్టిన భారతదేశపు మొట్టమొదటి మహిళగా ఈమె చరిత్రపుస్తకాల్లో నిలిచిపోయారు. కమీషనరుగా బాధ్యతలు చేపట్టడానికి ముందే ఆమె జూలై 1993లో రాజ్య సభ సెక్రటరీ జనరల్ గా నియమితులై 1997 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1997లో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు గా నియమితులయ్యారు. ఈ పదవిలో 25 జూలై 1997 నుండి 01 డిసెంబరు 1999 వరకు పనిచేశారు. అనంతరం 1999లో కర్ణాటక గవర్నరుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కామన్ వెల్త్ అసోసియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు అధ్యక్షులుగా ఎన్నికైన తొలి ఆసియా దేశస్తులుగా ఈమె చరిత్ర సృష్టించారు.

మరిన్ని విషయాలు :

ఈమె వ్యక్తిగతంగా ఓ ప్రముఖ రచయిత్రి కూడా! తెలుగు భాషలో ఇరవైకి పైగా గ్రంథాలు, నవలలు, కథానికలు, వ్యాసాలు, నాటకాలు రచించారు. ఈమె వి. ఎస్. రామావతార్ ను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు మరియు ఇద్దరు కుమార్తెలు. అంత సవ్యంగానే కొనసాగుతున్న తరుణంలో ఈమె అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం బారిన పడిన ఆమె 2013 ఏప్రిల్ 17 న తన 79వ ఏట అనారోగ్యంతో బెంగుళూరులో మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vs ramadevi biography  telugu famous women  

Other Articles