Hemalatha lavanam biography gurram jashuva duaghter

hemalatha lavanam biography, hemalatha lavanam history, hemalatha lavanam life story, hemalatha lavanam photos, hemalatha lavanam gallery, hemalatha lavanam, gurram jashuva history, gurram jashuva life story

hemalatha lavanam biography gurram jashuva duaghter : The biography of hemalatha lavanam who is daughter of famous writer gurram jashuva. she worked hard for poor people.

‘కలం’తో స్ఫూర్తినింపిన సామాజిక సేవకురాలు

Posted: 03/04/2015 04:02 PM IST
Hemalatha lavanam biography gurram jashuva duaghter

సమాజంలో బడుగు బలహీనవర్గాలపై, అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాలను, దారుణాలను అరికట్టేందుకు ఎందరో సామాజిక సేవకులు పుట్టుకొచ్చారు. మరికొందరు తమ కలంతో ఎన్నో కవిత్వాలు రచించి, వాటిద్వారా ఇతరుల్లో స్ఫూర్తినింపి సేవబాటలో నడిపించారు. అటువంటి వారిలో హేమలతా లవణం కూడా ఒకరు! ఈమె ఎవరో కాదు.. ప్రముఖ కవి ‘పద్మభూషణ్’ గుర్రం జాషువా కుమార్తె! ఆయనలాగే ఈమె కూడా ఎన్నో రచనలు చేయడంతోపాటు సామాజిక సేవకురాలు కూడా! వెనుకబడిన, నిమ్నకులాల్లో చైతన్యం పెంచడం కోసం ఈమె పలు కార్యక్రమాలను చేపట్టారు. వారికోసం ప్రత్యేకంగా సంస్థలు కూడా నిర్మించారు.

జీవిత చరిత్ర :

1932 ఫిబ్రవరి 26వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో జాషువా-మరియమ్మ దంపతులకు చివరి సంతానంగా హేమలతా లవణం జన్మించారు. ఈమె ప్రాథమిక, మాధ్యమిక విద్య గుంటూరులోనే సాగింది. అనంతరం మద్రాసు క్వీన్స్ కళాశాలలో బి.ఏ పూర్తిచేసి, అందులో బంగారు పతకం సాధించారు. నాస్తికత్వం, ప్రజాస్వామ్య విలువలు, గాంధేయ వాదం.. అనే విలువలకు కట్టుబడిన గోరా కుమారుడు లవణంతో హేమలతా వివాహం జరిగింది. అయితే.. వర్ణభేదాలను అతిక్రమించి జరిగిన ఆమె వివాహం అప్పట్లో పెద్ద సంచలనమే కలిగించింది. కొన్నాళ్ల తర్వాత ఆ వివాదాలు సద్దుమణిగాయి.

సామాజిక సేవకురాలిగా :

1. బందిపోటు దొంగల్లో మానసిక పరివర్తన తెచ్చేందుకు హేమలతా తన భర్తతో కలిసి ‘వినోబా భావే’ భూదానయాత్రలో పర్యటించింది.
2. 1961లో వాసవ్య విద్యాలయాన్ని స్థాపించి సమత, మమతల కోసం పాటుపడింది.
3. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో ‘ఆర్థిక సమతా మండలి’ అని సేవా సంస్థను స్థాపించి వెనుకబడినవారిలో, నిమ్నకులాల్లో చైతన్యం కోసం పలు కార్యక్రమాలు చేపట్టింది.
4. 1981లో కావలిలో 'నవవికాస్' అనే సంస్థను స్థాపించి దాని ద్వారా అణగారినవర్గాలను ఆదుకొంది.
5. జోగినులను, వారి పిల్లలను ఆదుకోవడానికి 'సంస్కార్’, ‘చెల్లి నిలయం’ అనే సంస్థలను అనే సంస్థలు ఏర్పరచింది. జోగినులకు వివాహాలు జరిపించింది.
6. అంధవిశ్వాసాలు 'బాణామతి' మహిళల జీవితాలను ధ్వంసం చేస్తోన్న వైనాన్ని గుర్తించి వాటిని ఆరోగ్య సమస్యగా గుర్తింపచేయడానికి కృషి చేసింది.
7. వర్ణాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించింది.
8. బాలికల కోసం నిజామాబాద్ జిల్లా, గాంధారి గ్రామంలో ప్రత్యేక పాఠశాల నిర్మించింది.
9. ‘చైల్డ్ ఎట్ రిస్క్’ (సి.ఎ.ఆర్) పేరుతో దొంగలు, తాగుబోతులు, వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన వారి పిల్లల కోసం సంస్కరణ కేంద్రం స్థాపించింది.
10. 1979లో ప్రకాశం, నెల్లూరు.. 1996 తూర్పుగోదావరి జిల్లాల్లో తుపాను వచ్చినప్పుడు ఈమె ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంది.

కవియిత్రిగా హేమలతా సేవలు :

తన తండ్రి జాషువా రాసిన కావ్యాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న దృఢసంకల్పంతో వాటన్నిట్నీ హేమలతా లవణం ముద్రించింది. అంతేకాదు.. స్వయంగా పలు ప్రక్రియల్లో రచనలు కూడా చేసింది. అహింసా మూర్తులు - అమర గాధలు, నేరస్థుల సంస్కరణం, జీవన ప్రభాతం, జాషువా కలం చెప్పిన కథ, మా నాన్నగారు,జీవనసాగరం, అనుభవ తరంగాలు, నేరస్తుల సంస్కరణ, తాయెత్తు - గమ్మత్తు, మృత్యోర్మా అమృతంగమయ వంటి పలురచనలు ఆమె చేసింది.

అవార్డులు - రివార్డులు :

1. 'జీవన ప్రభాతం' నవలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం పొందింది.
2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆత్మగౌరవ పురస్కారం,
3. కర్ణాటక ప్రభుత్వం నుంచి దేశస్నేహి పురస్కారం,
4. అమెరికా నుంచి ఎథీయిస్ట్ ఎచీవ్‌మెంట్ అవార్డు,
5. 2003 సంవత్సరానికి రెడ్ అండ్ వైట్ బ్రేవరి అవార్డు, సావిత్రి పూలే అవార్డు వంటివి ఎన్నో పొందింది.
6. ఆమె సంఘసేవికగా చేసిన కృషికి, రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌, తానా ఎచ్చీవ్‌మెంట్‌, వరల్డ్‌ ఎచ్చీవ్‌మెంట్‌ అవార్డులు అందుకున్నది.
7. అంబేద్కర్‌ శతజయంతి సందర్భంగా భీమరత్న అవార్డును పొందిన ఏకైక మహిళ హేమలత.


ఇంతటి గొప్ప ప్రస్థానాన్ని సాధించిన హేమలతా.. అండాశయపు క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని నాస్తిక కేంద్రంలో 2008 మార్చి 20వ తేదీన తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hemalatha lavanam  gurram jashuva  telugu news  

Other Articles