Surabhi kamalabai biography first telugu heroine tollywood industry

surabhi kamalabai news, surabhi kamalabai biography, surabhi kamalabai history, surabhi kamalabai life story, surabhi kamalabai photos, surabhi kamalabai movies, surabhi kamalabai story, telugu actresses, tollywood news

surabhi kamalabai biography first telugu heroine tollywood industry : The history of surabhi kamalabai who is the first telugu heroine in industry.

మొట్టమొదటి తెలుగు సినిమా కథానాయిక..

Posted: 02/11/2015 07:19 PM IST
Surabhi kamalabai biography first telugu heroine tollywood industry

తెలుగు చిత్రపరిశ్రమ ప్రారంభమైన తొలినాళ్లలో కథానాయికగా రంగప్రవేశం చేసి, నటనలో తమను తాము నిరూపించుకున్న తారల్లో సురభి కమలాబాయి ఒకరు. 1931లో సినీరంగంలో ప్రవేశించిన ఈమె.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈమె నటనను చూసి ప్రముఖులు సైతం ముగ్ధులై.. తమతమ సినిమాల్లో పిలిచి మరీ ఆఫర్లు ఇచ్చేవారు.

జీవిత చరిత్ర :

1907లో సురభి నాటక కళాకారుల కుటుంబములో కమలాబాయి జన్మించింది. కృష్ణాజీరావు, వెంకూబాయి తల్లిదండ్రులు . తల్లి వెంకూబాయి గర్భవతిగా వున్నా కూడా ఒక నాటకములో దమయంతి పాత్ర వేస్తున్నప్పుడు పురిటినొప్పులు రాగా తెరదించి ఆ రంగస్థలముమీదే కమలాబాయిని ప్రసవించింది. అలా ఆ విధంగా నాటకంలో పుట్టిన కమలాబాయి.. ఇలా కథానాయికగా గొప్ప పేరు సాధించారు. ఈమె బాల్యంలో కృష్ణుని, ప్రహ్లాదుని పాత్రలు వేస్తుండేవారు. యుక్తవయసు వచ్చిన తర్వాత మగపాత్రలు ఆపేసి ఆడపాత్రలు ధరించడం ప్రారంభించింది.

బాల్యం నుంచే రంగస్థల నటిగా ఎదిగిన ఈమె ప్రతిభను గుర్తించి దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి ఈమెకు కథానాయికగా తన సినిమాలో ఆఫర్ ఇచ్చారు. అలా ఆ విధంగా ఈమె 1391లో ‘భక్తప్రహ్లాద’ చిత్రంలో లీలావతి పాత్ర ధరించి.. మొట్టమొదటి తెలుగు సినిమా కథానాయికగా పేరొందారు. ఆ తర్వాత ‘పాదుకా పట్టాభిషేకం'లో సీతగా, 'శకుంతల' చిత్రంలో శకుంతలగా, ‘సావిత్రి' సినిమాలో టైటిల్ రోల్ పాత్రను పోషించారు. ఆనాడు ఈమె నటించిన చిత్రాలన్నీ మంచి విజయాలు సాధించాయి. పైగా.. తన నటనతో ప్రేక్షకుల్ని మైమరిపించి, ఎంతోమంది అభిమానులను సంపాదించుకోగలిగారు.

ఈమె నటనాప్రతిభను ప్రత్యక్షంగా వీక్షించిన బాలీవుడ్ దర్శకులు సైతం ముగ్ధులై ఈమెకు అవకాశాలు ఇచ్చారు. అందులో సాగర్ ఫిల్మ్స్ అధినేత ఈమె ప్రతిభకు ఆకర్షితుడై బొంబాయికి ఆహ్వానించాడు. దాంతో ఆమె పదేళ్లపాటు ఆ సంస్థ నిర్మించిన ఎన్నో సినిమాల్లో నటించింది. అటు హిందీతోపాటు తెలుగులోనూ నటించేది. 1939లో విడుదలైన భక్తజయదేవ సినిమాను తెలుగు, బెంగాళీ భాషలలో నిర్మించారు. ఆ రెండింటిలోనూ కమలాభాయే కథానాయిక. చివరగా ఆమె 1940లో వచ్చి తొలి ద్విభాషా చిత్రం ‘తుకారాం’లో కథానాయికగా నటించింది. ఆ తర్వాత కారెక్టర్ రోల్స్ చేయడం ప్రారంభించింది.

ఆర్థిక ఇబ్బందుల మధ్య మరణం :

ఈమె సినిమాల ద్వారా సంపాదించిన 30 వేల రూపాయల డబ్బులను భవిష్యత్ కోసం ఓ బ్యాంకులో డిపాజిట్ చేసింది. అయితే.. ఆ బ్యాంక్ దివాళా తీయడంతో.. ఆ డబ్బంతా కోల్పోవాల్సి వచ్చింది. ఇక అక్కడి నుంచి ఈమెను ఆర్థిక ఇబ్బందులు వెంటాడటం మొదలుపెట్టాయి. వయస్సు మీద సినిమాలు రాకపోవడంతో తన అక్కకూతురితో షూటింగులకు వెళుతుండేది. ఇక మూవీల్లో ఆఫర్లు రాక, ఆర్థిక ఇబ్బందుల నడుమ ఈమె 1971, మార్చి 30న తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : surabhi kamalabai biography  telugu famous actresses  

Other Articles