Chit chat with singer mina

Chit Chat with singer Mina

Chit Chat with singer Mina

పాటతో మెప్పించింది

Posted: 08/19/2013 07:12 PM IST
Chit chat with singer mina

 ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ‘సుమధుర సంగీత విభావరి’లో  మైన పాడిన పాటలు ప్రేక్షకుల చేత ‘వాహ్వా’ అనిపించాయి. పుట్టింది అమెరికాలో అయినా, చదువుతున్నది అక్కడే అయినా... చక్కటి తెలుగులో పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించిన మైనతో ఇంటర్వ్యూ....
 
 మీరుండేది అమెరికాలో కదా... కర్ణాటక శాస్త్రీయ సంగీతం గురించి ఎలా ఆసక్తి కల్గింది?

అమెరికాలోని టీఎల్‌సీఏ ఆధ్వర్యంలో ఉగాది రోజు (2005) ఆలయాల్లో కాంపిటిషన్స్ జరిగాయి. అది ఫస్ట్‌గ్రేడ్ చదివే  చిన్నారులకు. పలుకే బంగారమాయే... అనే కీర్తన, క్లాసికల్ సాంగ్స్ పాడాను. అందులో ప్రైజ్ వచ్చింది.  ఇక  అప్పటి నుంచి శాస్త్రీయ సంగీతమన్నా, కర్ణాటక సంగీతమన్నా, తెలుగు పాటలన్నా ఆసక్తి పెరుగుతూ వచ్చింది.
 
 మ్యూజిక్ క్లాసుల గురించి....
 

అమెరికాలో మల్లిక అనే టీచర్ దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. వేసవిలో ఇండియాకు వచ్చినప్పుడు ప్రముఖ గాయకులు నీహాల్ దగ్గర క్లాసికల్ ఫిల్మ్ సాంగ్స్, లైట్ మ్యూజిక్ మెళకువలు తెలుసుకుంటూ ఉంటాను.
 
మీ గాత్రం ఎలాంటి  సంగీతానికి నప్పుతుందని భావిస్తున్నారు ?

ఫాస్ట్‌బీట్ సాంగ్స్, పాప్ సాంగ్స్‌కు కూడా నా గాత్రం సూట్ అవుతుందని ప్రముఖ గాయకులు కొందరు అన్నారు. ఇప్పుడిప్పుడే అటువైపు అడుగులు వేస్తున్నాను.
 
అమెరికాలో పుట్టి పెరిగినా చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు...

ఎవరికైనా ఇది సహజంగా వచ్చే సందేహమే (నవ్వుతూ). ఇంట్లో ఎలాగూ తెలుగు మాట్లాడతారు.  తెలుగు సినిమాలపై ఉన్న ఆసక్తి  కూడా తెలుగు భాష నేర్చుకునేలా చేసింది. సినిమాలు కేవలం వినోదానికి మాత్రమే కాదు, భాషను అభివృద్ధి చేస్తాయి. అది నా విషయంలో నిజమైంది. అందుకు అమ్మ మాధవి కూడా చేయూతనిచ్చింది.  నేను ఏదైనా కావాలని, తినాలని అడిగినా అది తెలుగులోనే చెప్పితే కానీ చేసి పెట్టేది కాదు. దాంతో నాన్న (ఈదుల మురళి)ని అడిగి తెలుసుకుని మాట్లాడేదాన్ని. దీంతో తెలుగు భాష అలవాటైంది.
 
 సంగీతంలో రాణించేందుకు మీకు స్ఫూర్తి  ఎవరు ?

ఇన్‌స్పిరేషన్ అంటే చెప్పలేనుగాని ప్రోత్సాహం విషయానికి వస్తే మాత్రం  మా తాతయ్య  శ్రీనివాసరెడ్డి నన్ను ప్రోత్సహించారు. ఎప్పుడూ  ‘చదువు..చదువు’ అనకుండా తల్లిదండ్రులు నన్ను సంగీతం వైపు ప్రోత్సహించారు. వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సహకరించటం వల్లే ఇంతవరకు రాగలిగాను.
 
 సంగీతం కాకుండా  ఇతర ఆసక్తులు ఏమైనా ఉన్నాయా ?
 

టెన్నిస్  ఆడతాను, సైన్స్ కాంపిటీషన్స్‌లో, స్పెలింగ్ పోటీల్లో పాల్గొంటాను. పాఠశాలల్లో డిబేట్‌క్లబ్‌లో పాల్గొంటాను.
 
 మీ పేరు గురించి చెప్పండి...
 

నా పేరుకు అర్థం ‘పాడే పక్షి’ అని. నేను పుట్టక ముందే ‘మైన’ అనే పేరు పెట్టాలని అమ్మ, నాన్న డిసైడ్ అయ్యారు. అలా పాడతానని ముందే ఊహించి, తెలిసే పెట్టారేమో(నవ్వుతూ)
 

ఈవెంట్ ఎలా జరిగిందని భావిస్తున్నారు ?

గొప్ప వాళ్ల  ఎదుట పాడే అవకాశం కలిగింది. వారి కామెంట్స్ మంచి స్ఫూర్తిని ఇచ్చాయి. ఈ ఈవెంట్ కొత్త ఎనర్జి ఇచ్చింది. ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్,  గాయకులు నీహాల్, విశ్వ, ఉపాసకులు దైవజ్ఞశర్మల ప్రశంసలు ఉత్సాహాన్ని ఇచ్చాయి.
 
హో... బాయ్ గీతావిష్కరణ చేశారు గదా? అలా మరో ఆల్బమ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ?

ఆదిత్య మ్యూజిక్ వారి ద్వారా ‘హో..బాయ్’ ఆడియో ఆల్బమ్ తీసుకువచ్చాను. అంతర్జాతీయ స్థాయిలో దీనికి ప్రాచుర్యం కలిగించేందుకు ఆదిత్య వారు ప్రయత్నిస్తున్నారు. సోలో ఆల్బమ్‌కి తయారవుతున్నాను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles