Telugu actress soundaryas 40th jayanthi special article

actress soundaryas 40th jayanthi special article, soundaryas 40th jayanthi special article, telugu actress soundaryas 40th jayanthi special article, actress soundarya jayanthi special, soundaryas 40th jayanthi today, actress soundarya jayanthi special online, happy birthday soundarya, 40th birthday soundarya, remembaring soundarya birthday, Heroine soundrya, happy birthday soundarya

telugu Actress Soundaryas 40th Jayanthi Special article

సౌందర్య జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలం !

Posted: 07/18/2013 05:31 PM IST
Telugu actress soundaryas 40th jayanthi special article

సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. సౌందర్య ప్రాథమిక విద్యను అభ్యసించుచున్నప్పుడే మొదటి చిత్రంలో నటించింది. సౌందర్య ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, సౌందర్య తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, సౌందర్య చదువును మధ్యలోనే ఆపేసింది. సౌందర్య (జులై 18, 1972 - ఏప్రిల్ 17, 2004) ప్రముఖ సినీనటి. సౌందర్య తెలుగు, తమిళం, కన్నడం మరియు మళయాలం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా వెలిగిన సౌందర్య బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో సౌందర్య మంచి పేరు ప్రఖ్యాతలు గడించి, ఇక్కడ సౌందర్య విజయఢంకా మ్రోగించింది. సౌందర్యకన్నడ, తమిళం, మళయాళం మరియు ఒక హిందీ చిత్రంలో నటించింది. హిందీలో సౌందర్య అమితాబచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో నటించింది.

చెరగని చిరునవ్వు. అచ్చమైన తెలుగుతనం ఉట్టిపడే అందమైన తార. ఎందరో ప్రేక్షకుల మదిని దోచుకున్న 'సౌందర్య' తార. అనతి కాలంలోనే అగ్ర తారగా వెలుగొంది అంతే తొందరగా కానరాని లోకాలకు వెళ్ళిన ప్రముఖ సినీ నటి 'సౌందర్య' జన్మదినం నేడు. సౌందర్య భౌతికంగా మరణించి ఏళ్ళు గడుస్తున్న ఇప్పటికీ సౌందర్య జ్ఞాపకాలు చెక్కు చెదరలేదు. అభిమానులు తగ్గలేదు. సౌందర్య పుట్టింది కర్ణాటకలో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. సౌందర్య తెలుగుతో పాటు ఇతర దక్షినాది బాషలలో నటించినప్పటికీ తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది. 12 ఏళ్ళలోనే అగ్రతారగా వెలుగొందింది. నేటి తరం కథానాయికలకు స్పూర్తిగా నిలిచింది. ఏనాడు అశ్లీలతకు తావియ్యలేదు. అలాంటి పాత్రలకు ఆమడ దూరంలో ఉంది సౌందర్య. తెలుగులో ముఖ్యంగా వెంకటేష్ సరసన ఎక్కువ సినిమాల్లో నటించి మంచి జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి లెక్కలేనన్ని అవార్డులు సొంతం చేసుకుంది. సౌందర్య కన్నడంలో నటించిన ఆఖరి చిత్రం "ఆప్త మిత్ర" విజయవంతమైంది. ప్రస్తుతం సౌందర్య జ్ఞాపకార్ధం "సౌందర్య స్మారక పురస్కారం"ను కర్ణాటకాంధ్ర లలితకళ అకాడమి వారు ప్రతీ సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరించుచున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అమ్మోరు, పవిత్రబంధం, అంత:పురం చిత్రాలకై అందుకున్నారు. పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనిషిగా ఆవిడకు పేరు ఉంది. వీటన్నింటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు "సౌందర్య".సౌ౦దర్యని తెలుగి౦టి ఆడపడుచుగా ఆదరి౦చారు.ఆమెను జూనియర్ సావిత్రి అ౦టారు.సౌ౦దర్యకు "నవరసనటన మయూరి" అనే బిరుదుగలదు.సౌ౦దర్య నటనకు పద్మశ్రీ ఇవ్వకపొవడ౦ చాలా బాధాకర౦.

కర్నాటక, ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి పరచారు. ఓ అనాధాశ్రయాన్ని, ఓ పాఠశాల 'అమర సౌందర్య విద్యాలయ' పేరుతో స్థాపించారు. తన తమ్ముడు అమరనాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అంతేగాక సౌందర్య భర్త మరియు ఆడపడుచుల కలలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు, మరియు సహాయ సహకారాలను అందించారు. వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే వున్నది. అయితే భౌతికంగా ఈ లోకంలో లేనప్పటికీ తన జ్ఞాపకాలతో అభిమానుల సౌందర్య బ్రతికే ఉంది. కళాకారులకు మరణం ఉండదు అన్నది అక్షర సత్యం.. 'సౌందర్య' మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలం...

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles