Singer chitra birthday special article

Singer Chitra Birthday Special article, Singer Chitra Birthday Special Video, Singer K S Chitra Birthday, Chitra Awards,

Singer Chitra Birthday Special article

కేఎస్ చిత్ర బర్తడే స్పెషల్

Posted: 07/27/2013 06:24 PM IST
Singer chitra birthday special article

చిత్రగా సుపరిచితురాలైన కె.ఎస్.చిత్ర, భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదందుకున్న ఈమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ మరియు బెంగాలీ భాషల సినిమాలకు గాత్రదానం చేసింది. చిత్ర ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 15 అవార్డులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి 9అవార్డులు, తమిళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 4 అవార్డులు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము నుండి 2 అవార్డులు అందుకొన్నది. ఈ విధంగా దక్షిణ భారతదేశములోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది. చిత్ర వేలకొద్ది సినిమా పాటలు మరియు సినిమాయేతర పాటలు రికార్డు చేసింది.

 

తన గాత్ర జీవితములో ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకొన్నది. ఇన్ని పురస్కారాలు మరే ఇతర నేపథ్యగాయకురాలు అందుకోలేదు. జాతీయ పురస్కారాలు అందుకొన్ని సినిమాలు. 1986 - సింధుభైరవి, తమిళ సినిమా1987 - నఖక్షతంగళ్, మలయాళ సినిమా , 1989 - వైశాలీ, మలయాళ సినిమా, 1996 - మిన్సార కనువు, తమిళ సినిమా, 1997 - విరాసత్, హిందీ సినిమా, 2004 - ఆటోగ్రాఫ్, తమిళ సినిమా. చిత్ర, 1963, జూలై 27న కేరళలోని తిరువనంతపురములో, సంగీతకారుల కుటుంబములో జన్మించింది. బాల్యములో ఈమె తండ్రి కృష్ణన్ నాయర్, చిత్ర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. చిత్ర తొలి గురువు ఆమె తండ్రే. చిత్ర 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వము యొక్క నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలరుషిప్పుకు ఎంపికైనప్పటినుండి డా. కె.ఓమనకుట్టి వద్ద కర్ణాటక సంగీతములో విస్తృతమైన శిక్షణ పొందింది. 1979లో ఎం.జి.రాధాకృష్ణన్ ఈమె మళయాల సినీ నేపథ్యగానానికి చిత్రను పరిచయం చేశాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు ఇళయరాజా నేతృత్వములో ఈమె చెన్నైలోని తమిళ సినిమారంగములో అడుగుపెట్టింది. దక్షిణాది భాషలు మరియు హిందీలలో ఈమెకున్న పరిచయము వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలదు. గాయిని చిత్ర సినీప్రయాణంలో కొనసాగుతూనే ఉండాలని మనం కోరుకుంద్దాం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles