Shreya ghoshal interview

Shreya Ghoshal Interview, singer Shreya Ghoshal Interview,

Shreya Ghoshal Interview, singer Shreya Ghoshal Interview,

పాటలకు ప్రాణం పోసిన శ్రేయా

Posted: 07/16/2013 01:01 PM IST
Shreya ghoshal interview

శ్రేయా ఘోషాల్‌ గురించి చెప్పడం అంటే ఆమె పాటల గురించి చెప్పడమే. సంగీతానికి.. శ్రేయాకు మధ్య విడదీయలేని ఒక అనుబంధం. నువ్వే నా శ్వాస అంటూ ఒకరికి ఒకరు చిత్రంలోని పాట తెలుగు శ్రోతలను నేటికీ అలరిస్తుందంటే కారణం ఆ పాటలోని సాహిత్యంతో పాటు శ్రెయా ఘోషాల్‌ గాత్రం కూడా అని చెప్పవచ్చు. గౌతం ఎస్‌ఎస్‌సీలో ఎదో ఆశా అంటూ సాగిన పాట అభిమానుల ఎద లయను తప్పించింది. హిందీలో 2002లో వచ్చిన దేవదాస్‌ చిత్రంతో గాయనిగా ెకరీర్‌ ప్రారంభించిన శ్రేయా నేటికీ సంగీత ప్రస్థానాన్ని కొనసాగిస్తూ శ్రోతలను అలరిస్తోంది. 

ఒక్కడు చిత్రంతో నువ్వేం మాయ చేశావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని అంటూ తెలుగు సంగీతంలో అరంగ్రెటం చేసిన శ్రేయా, ఇలా తెలుగులోనే ఇతర భాషల్లోనూ, ఇతర దేశాల్లోనూ ఆమె స్వరంతో కుర్రాకారుని ఉర్రుతలుగించింది. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో బెంగాలీ కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు బిశ్వజిత్‌ ఘోషాల్‌, సర్మిస్తా ఘోషాల్‌. తను పుట్టిన మూడు మాసాల తరువాత బెంగాల్‌ నుంచి శ్రేయా కుటుంబం సభ్యులు రాజస్థాన్‌లోని కోటాకు మకాం మార్చారు. ఆమె తండ్రి ఒక ఎలక్ట్రిక్‌ ఇంజనీరు. రాజస్థాన్‌లోనే దాదాపు 13 సంవత్సరాలు ఉన్న శ్రేయా అక్కడే ఉన్న ఆటోమిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ పాఠశాలలో ఎనిమిదవ క్లాసు వరకు చదివింది.

సంగీతంలో ఓనమాలు

రాజస్థాన్‌లోని కోటాలో రావత్‌భాటాలో నివసించే సమయంలోనే శ్రేయాకు సంగీతంపై అభిమానం ఏర్పడింది. తల్లి మంచి గాయని అవడంతో తరచుగా ఆ కార్యక్రమాలలో తల్లితో పాటు అందులో పాల్గొనేది. ఆ సమయంలోనే తల్లిని గమనించి సంగీతంలో అనేక విషయాలను నేర్చుకుంది. ఇంట్లో తల్లి సంగీత సాధన చేసే సమయంలో ఆ పాటలను హమ్‌ చేసేది. ఇది గమనించిన తల్లిదండ్రులు శ్రేయాకు సంగీతంలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించుకున్నారు.

గాయనిగా ప్రస్థానం

శ్రేయాకు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి ఆమెకు ఆది గురువుగా మారి సంగీతంలో ఓన మాలు నేర్పారు. అలా కొంతకాలం సాధన చేసింది.కొంత కాలం తరువాత తమ క్లబ్‌ వార్షికోత్సవాలలో తొలిసారి రంగస్థలంపై ప్రదర్శననిచ్చింది. ఆరేళ్ల వయస్సులోనే కోటాలోని రాకేష్‌ శర్మాజీ, శ్రీ జయవర్ధన్‌ భట్నాగర్‌ వద్ద హిందుస్తానీ శాస్ర్తీయ సంగీతంలో ప్రావీణ్యం గడించారు. శిక్షణా కాలంలోనే హిందీచిత్ర గీతాలను పాటడం, ప్రముఖ ప్లేబ్యాక్‌ గాయకుడు,పద్మ శ్రీ అవార్డు గ్రహీత కీశే కళ్యాన్‌జీ భై వద్ద ప్లేబ్యాక్‌ సింగింగ్‌లో ప్రావీణ్యం సంపాదించారు. 1997 ముంబైకి మకాం మార్చారు. కీశేముక్తా భిడేజీ వద్ద హిందుస్తానీ శాస్ర్తీయ సంగీతంలో శిక్షణను కొనసాగించారు. 

గాయినిగా గుర్తింపు

1995: శ్రేయా ఘోషాల్‌ డిల్లీలో జరిగిన ఆల్‌ ఇండియా లైట్‌ వోల్‌ సంగీత పోటీలో జూనియర్‌ లెవల్‌లో గెలుపొందడంతో అమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలైన కళ్యాన్‌జీ-అనంద్‌జీ, రాజన్‌-సజన్‌ మిశ్రాలు శ్రేయాలోని ప్రతిభను గమనించారు. 

1996: టీవిఎస్‌ సారేగామా కార్యక్రమంలోని 75వ ప్రత్యేక బాలల ఎపిసోడ్‌లో పోటీలో పాల్గొని విజయాన్ని సాధించారు.

1998: మరాఠీ, బెంగాలీ తదితర ప్రాంతీయ భాషల్లో రికార్డింగ్‌లలో పాల్గొనటం ప్రారంభించింది.

2000: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజలీలా భంసాలీ, సంగీత దర్శకుడు ఇస్మాయెల్‌ దర్బార్జీలు దేవడాస్‌ చిత్రంలో పాడేందుకు శ్రేయాను ఎంచుకున్నారు.

2002: దేవదాస్‌ చిత్రం ఆడియో విడుదలవ్వడంతో శ్రేయా ప్లేబ్యాక్‌ కెరీర్‌ ప్రారంభమైంది. ఈ చిత్రం సాధించిన విజయం శ్రేయా కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ తరువాత శ్రేయా కెరీర్‌ గ్రాఫ్‌ పైపైకి వెళ్ళింది.

పాటలకు ప్రాణం పోసిన శ్రేయా

దేవదాస్‌ చిత్రం విజయం తరువాత శ్రేయాకు మంచి మంచి అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. వివిధ భాషల్లోని ప్రము సంగీత దర్శకులు శ్రేయాను అవకాశాలతో ముంచెత్తారు.అలా ప్రారంభమైన శ్రేయా ప్రస్థానం నేటికీ కొనసాగుతుంది. తెలుగు, తమిళం, హిందీ, అస్సామీ, బెంగా‚లీ, భోజ్‌పూరి, గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, నేపాలీ, ఒరియా వంటి అనేక భాషల్లో పాడారు. తెలుగులో శ్రేయా పాడిన పాటలు యువతను విపరీతంగా అలరించాయి. నేటికీ శ్రేయా గాయనీ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతోంది.

మ్యూజిక్‌ డైరెక్టర్స్‌తో...

ఏ.ఆర్‌.రెహ్మాన్‌, హిమేష్‌ రేష్మియా, ఇళయరాజ, యువన్‌ శంకర్‌ రాజా, మణిశర్మ, ఆర్‌పి. పట్నాయక్‌ ప్రఖ్యాత సంగీత దర్శకుల కోసం పాడారు.

ప్రొఫైల్‌

పూర్తి పేరు : శ్రేయా ఘోషాల్‌

పుట్టిన తేది: 12 మార్చి, 1984

జన్మ స్థలం: దుర్గాపూర్‌, పశ్చిమ బెంగాల్‌

వృత్తి    : గాయనీ

ప్రత్యేకతలు: గజల్‌, చిత్రగీతాలు, 

                 హిందుస్తానీ క్లాసికల్‌ సంగీతం

తెలుగులోతొలి చిత్రం: దేవదాస్‌ (2002)

పాడిన భాషలు : తెలుగు, తమిళం, హిందీ, 

                 అస్సామీ, బెంగాలీ, 

                 భోజ్‌పూరి, గుజరాతీ, 

                 కన్నడ, మరాఠీ, 

                 మలయాళం, నేపాలీ,ఒరియా

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles