Jayasudha birthday special

Jayasudha,Birthday,Special,act,Sivaranjani,Premabhishekam,Pranam,khareedu,idi,katha,kadu,Meghasandesam,Amma,Nanna,Tamil,Ammai

Sahajanati Jayasudha Birthday Special.

జయసుధ బిర్త్ డే స్పెషల్

Posted: 12/17/2012 06:59 PM IST
Jayasudha birthday special

Jayasudhaసహజ నటి అన్న మాటకు అచ్చమైన రూపం, జయసుధ... ఏ పాత్రలో అయిన ఒదిగిపోయి నటించడంలో ఆమె దిట్ట... అందుకే అగ్ర కథానాయిక గా ఎన్ని సినిమాల్లో నటించినా, కొంత విరామం తరువాత, తిరిగి అమ్మ గా, వదినగా, ఎన్నో చిత్రాలలో, ముఖ్యమైన పాత్రలను పోషించిన, పోషిస్తున్న ఘనత, జయసుధ గారిదే అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు...

ముఖ్యంగా, ఎదిగిన కొడుకుకి ఒక తల్లి ఎలా ఉండాలి అనే భావానికి నిదర్సనంగా, తల్లీ - కొడుకుల అనుబంధానికి ప్రతీకగా రూపొందిన 'అమ్మ నాన్న ఒక తమిళ్ అమ్మాయి', చిత్రంలో జయసుధ గారి నటన, అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. 'జ్యోతి', 'ఇది కధ కాదు', 'మేఘసందేశం', 'ప్రేమాభిషేకం' వంటి చిత్రాలలో జయసుధ గారి నటన, అందరినీ కట్టిపడేస్తుంది... ఎటువంటి పాత్ర పోషించినా ఆ పాత్ర లో ఓడిగిపోతుందే తప్ప ఎక్కడా 'నటిస్తున్నట్టు' అనిపించదు... అందుకే, 'సహజ' నటిగా గుర్తింపు పొందారు, జయసుధ...అటు నటిగానే కాక, ఇటు రాజకీయాల్లో కూడా, బాధ్యతలని దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నారు జయసుధ... ఈ నటి అసలు పేరు, సుజాత... బాలచందర్ గారు దర్శకత్వం వహించిన 'అరంగేట్రం' అనే తమిళ చిత్రంలో కధానాయికగా చిత్ర సీమ కు పరిచయం అయిన సుజాతను, జయసుదగా మార్చింది ఈ దర్శకుడే...

అసలు, సుజాత, జయసుదగా ఎలా మారారు?పన్నెండేళ్ల అమ్మాయి సుజాత  తన మేనత్తను చూడడానికి సినిమా షూటింగుకు వెళ్లేది. అక్కడి నటీనటులను కళ్లార్పకుండా చూస్తూ  తను కూడా సినిమాలో నటించాలని  అనుకుంది. కాని తండ్రి ఒప్పుకోలేదు. ఆ  అమ్మాయి ఆసక్తిని  గమనించిన మేనత్త ఆయనను ఒప్పించి తన చిత్రంలోనే అవకాశం ఇచ్చింది. అమాయకపు చూపులతో, మాటలకంటే కళ్లతోనే ఎక్కువ నటించేసింది సుజాత. అలా క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చిన ఆ అమ్మాయే నేడు దేశమంతా గుర్తించి, మెచ్చుకునే సహజనటి అయింది. ఇప్పటివరకు దాదాపు 300 సినిమాల్లో నటించిన ఆ ముగ్ధమనోహరి సహజనటి జయసుధ.

చిన్నతనంలోనే సినిమారంగంలో ప్రవేశించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. సుజాతగా వచ్చినా జయసుధగానే ప్రేక్షకుల మనసుల్లో స్థిరపడిపోయింది.ఈ రోజు, ఈ సహజ నటి తన పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు... త్వరలో, ఇంకొక మంచి పాత్రలో, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ద్వారా మనకు తన నటనతో కనువిందు చెయ్యబోతున్నారు... ఈ నటికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తోంది ఆంధ్రవిశేష్ బృందం...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kavitha lankesh gauri lankesh
Mahanati savatri jayanti special  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles