Mahanati savatri jayanti special

Mahanati Savithri, actress savithri, director savithri, producer savithri, savithri jayanti

Mahanati Savithri jayanthi special.

MahaNati Savatri Jayanti special.png

Posted: 12/06/2012 07:46 PM IST
Mahanati savatri jayanti special

Savitriమహా నటి అన్న పేరుని సార్ధకం చేసిన నటీమణి... నటన అంటే ముఖ కవళికలు మాత్రమె కాదు, కళ్ళు కూడా నటిస్తాయి అని తన నటనతో నిరూపించిన అభినేత్రి... నాటి నుండి నేటి తరం నాయికలవరకు, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు పోచించాలి అంటే, ఈ నటినే ఆదర్శంగా తీసుకుంటారు... ఈమె తరువాత, కొన్ని వందల మంది నటీమణులు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికలుగా ఒక వెలుగు వెలిగినా, పూర్తీ స్థాయిలో ఈ నటీమణితో ఎవ్వరూ సరితూగాలేకపోయారు.

నవరసాలని అవలీలగా పలికించగల నటి... 70 లలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన వాణిశ్రీ వంటి వారే, ఈ నటీమణి నటనని అనుకరించేవారు అంటే, ఆమె ఇంకెవరో కాదు, సావిత్రి గారు...హీరోయిన్ అంటే నేటికి ఇంకా పూర్తీ స్థాయి లో ప్రాముఖ్యత ఇవ్వని మన తెలుగు సినీ పరిశ్రమలో, హీరోయిన్ గా, అగ్ర హీరోలతో సమానంగా, ఒక విధంగా అంత కంటే ఎక్కువ గౌరవం, గుర్తింపు పొందిన నటి సావిత్రి... ఒకానొక దశలో, కదానాయికుల కంటే అధికంగా పారితోషకం తీసుకున్న నటిగా సావిత్రి గుర్తుండిపోతారు. నటి గా ఈమె యెంత పేరుని సంపాదించుకున్నారో, దాన ధర్మాలలో కుడా అంటే ఖ్యాతిని ఆర్జించారు. అడిగినవారికి లేదు అనకుండా తన దగ్గర ఉన్న డబ్బు, నగలు, ఇచ్చేసేవారట సావిత్రి... అసలు దానం చెయ్యడం కోసమనే, ప్రతీ రోజు కొంత డబ్బు తన దగ్గర అట్టే పెట్టుకునే వారట. యిన్ని దానాలు చేసినా, ఒకసారి సావత్రి గారు ట్యాక్స్ కట్టలేకపోయినప్పుడు, అధికారుల తనిఖీలో బయటపడి, వారు స్వాదీనం చేసుకున్న ఆమె నగల విలువే, ఆ కాలం లో 30 లక్షలకు పైగా ఉందంటే, ఆమె యెంత అర్జించారో మనం ఊహించవచ్చు...

ఈ నటీమణి చెన్నై లో ఎన్నో ఎస్టేట్లు, బంగళాలు నిర్మించారు... అసలు సావిత్రి గారు ఉన్నంతకాలం, చెన్నైలోని ఆమె ఇంటి ముందు కనీసం 6 కార్లయినా ఎప్పుడు ఉండేవంటే, సావిత్రి గారి హోదా ప్రత్యేకించి వివరించనక్కరలేదు.'మంచి మనసులు' నుండి 'గుండమ్మ కథ' వరకు 'మిస్సమ్మ' నుండి 'రక్త సంబంధం' వరకు, 'దేవదాసు', 'కన్యా శుల్కం', 'సుమంగళి', 'అర్ధాంగి'... ఇలా ఊకటేమిటి, సావిత్రి గారు నటించిన ప్రతీ చిత్రం, పోషించిన ప్రతీ పాత్ర, ప్రేక్షకుల మదిలో చిరస్థాయి లో నిలిచిపోతుంది...ఎటువంటి మెక్ అప్ సామాను అవసరం లేకుండా పాత్ర, సన్నివేశానికి తగ్గట్టుగా, సహజంగా ఏడవటం, గల గల మని 10 నిమిషాల పాటు నవ్వడం, కేవలం కళ్ళతోనే కోటి భావాలను పలికించడం లో సావిత్రి దిట్ట. తమిళ అగ్ర హీరో జెమినీ గనేషన్ గారిని ప్రేమ వివాహం చేసుకున్న సావిత్రి గారు, వివాహం తరువాత కూడా, అటు నటిగా, ఇటు ఇల్లాలిగా ఇద్దరు పిల్లల తల్లిగా, బాధ్యతలని నిర్వహించారు...

ఆత్మాభిమానానికి ప్రతీక అయిన సావిత్రి తత్త్వం ఎటువంటిదంటే, తన భర్త దగ్గరనుండి కూడా డబ్బు తీసుకోక, తన సంపాదనతోనే జీవించేవారు.నటిగా, దర్శకురాలిగా నిర్మాత గా, తెలుగు సినీ రంగంలో ఏంతో గుర్తింపు తెచ్చుకున్నారు సావిత్రి... ఈమె గురించి యెంత వర్ణించినా, యెంత చెప్పినా తక్కువే...ఈ మహానటి జయంతి ఈ రోజు... తిరుగులేని మహా నటిగా, ఆత్మాభిమానం ఉన్న మహిళగా, సావిత్రిగారు చిరకాలం గుర్తుండిపోతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles