Soniyaghandi

Vinod Mehta Biography, soniya Ghandi, editor, outlook, AICC president,

SoniyaGhandi.GIF

Posted: 11/18/2011 04:00 PM IST
Soniyaghandi

soniya_Ghandiమన దేశంలో నిజమైన ఎడిటర్లుగా చెప్పదగిన కొద్ది మందిలో వినోద్ మెహతా ఒకరు. ఇంగ్లీషు వీక్లీలలో కొత్త ఒరవడిని సుష్టించిన వినోద్ మెహతా ఆత్మకథే లక్నోబాయ్. సమకాలిన రాజకీయాలు, రాజకీయ నాయకులపై విస్పష్టమైన అభిప్రాయాలున్న వినోద్ మెహతా – గత పదిహేనేళ్లలో జరిగిన సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. వాటిని సజీవంగా మన ముందు ఉంచిన  కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.
సోనియాగాంధీకి సంబంధించిన కొన్ని విషయాలను వినోద్ మెహతా ‘లక్నోబాయ్’లో చెప్పారు. అవేటంటే....

గత ఏడేళ్లలో సోనియాను 6 సార్లు కలిసుంటాను. నేను జన్ పథ్ 10 ఎడిటర్ ని అనుకునే వారికి ఇది చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు. నేను ఎప్పుడూ రాజ్యసభ సీటు కాని, పద్మశ్రీ బిరుదు కాని, ఏదైనా దేశానికి రాయబారిగా నియమించమని కాని ఎన్నికల్లో టిక్కెట్ కానీ అడగలేదు. ఇదేమీ నాకు ఇస్తానని ఆశ చూపలేదు. అవుట్ లుక్ వార్షికోత్సవ సభను ఆమెను ముఖ్య అథితిగా రమ్మని పిలిచాను.  ఆమె వచ్చింది.
ఇప్పడు ఆమె గురించి నా అభిప్రాయం చెబుతాను. నాకు తెలిసినంత వరకు సోనియాకు తన పార్టీలోనూ ఇతర పార్టీలలోనూ జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. తన పార్టీలో ఉన్ననేతల, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తిగత విషయాలు కూడా ఆమెకు తెలుస్తాయి. సోనియాతో అరగంట మాట్లాడితే – ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ప్రతివారం వచ్చే కూమీ కపూర్ గాసిప్ కాలమ్ కు కావాల్సినంత సమాచారం దొరుకుంది.
చాలా సంయమనం : సోనియా ’గూంగి గూడియా‘ (మాట్లాడలేని బొమ్మ.. ఒకప్పుడు ఇందిరను  ఈవిధంగానే అనేవారు) కాదు. 1997కి ముందు రాజకీయాలలోకి రావాలా వద్దా అనే విషయంపై ఆమెకు ఊగిసలాట ఉండేది. కానీ ఒకసారి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ... జాతీయ రాజకీయాలపై ఆమె అవగాహన పెంచుకుంది. తన పార్టీకి ఏది మంచిది అనే కోణం నుంచే మె వాటి గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. కాని ఆమె వాస్తవవాది. అవసరమైనప్పుడు చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తుంది. మన్మోహన్ ప్రధాని అయినా ఆమె ప్రభుత్తాన్ని నడుపుతుందనే విమర్శ చాలా కాలంగా ఉంది. మన్మోహన్ అధికారాన్ని తక్కువ చేస్తోందనే భావన రాకుండా ఉండటం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటానని నాతో చెప్పింది.

‘‘ ఏ పబ్లిక ఫంక్షన్ కైనా సరే మన్మోహన్ కన్నా ఒక ఐదు నిమిషాలు ముందు వెళ్తా. ఆయన వెళ్లిన తర్వాతే అక్కడ నుంచి వెళ్తా.. అది ప్రోటోకాల్ అని ఆమె చేసిన వ్యాఖ్యలు. ఈ విషయాలలో సోనియా ఎంత జాగ్రత్తగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తాయి.
సంప్రదింపులే ఎక్కువే : పార్టీలో ఉన్నవారందరినీ కలుపుకుపోవాలనే ఉద్దేశంతో సోనియా అవసరమైన దాని కన్నా ఎక్కువ సహనాన్ని ప్రదర్శిస్తారు. కఠినమైన చర్యలు తీసుకోకుండానే వారిని దారిలోకి తీసుకురావడం కోసం ఆమె తరుచూ నిర్ణయాలను వాయిదా వేస్తుంది. కొన్నిసార్లు అసలే చర్య తీసుకోదు. వైయస్ కుమారుడు జగన్ విషయంలో కూడా ఇటు రాష్ర్టంలో అటు కేంద్రంలో అనేక తాయిలాలు చూపించారు. కానీ అతను వెంటనే సీఎం కుర్చీ కావాలని పట్టుబట్టాడు.

ఆమె ఒక నియంత అనే ఆరోపణ నిజం కాదు. తన వ్యక్తిగత స్థానానికి, కుటుంబానికి సమస్య రానంత వరకూ – సోనియా అందరితోను మాట్లాడి.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవటానికే ప్రయత్నిస్తారు. దేశంలో అతి ముఖ్యమైన రాష్టానికి చెందిన ముఖ్యమంత్రిని ఒకరు తన పని వదిలేసి డబ్బు సంపాదించటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ‘‘దీపావళి సెలవులు అయిపోయిన తరువాత ఆయన్ని తొలగిస్తాం’’ అని సోనియా నాతో చెప్పారు. కానీ ఆ ముఖ్యమంత్రిని తొలగించటానికి ఆ తర్వాత 18 నెలలు పట్టింది. ఏదైనా క్లిష్టమైన సమస్య ఎదురయినప్పుడు – తొలి స్పందన నైతికంగాను, వ్యూహత్మకంగాను మంచిదే అయి ఉంటుంది. కాని సీనియర్ నేతలతోను, సలహాదారులతోనూ మాట్లాడిన తరువాత ఆమె పూర్తి విరుద్ధమైన నిర్ణయం తీసుకుంటారు.

రెండు ముఖ్యమైన పాఠాలు : తన వ్యక్తిగతమైన వ్యవహారాలకు సంబంధించి మాత్రం ఆమె ఎవరినీ సంప్రదించదు. తమ పిల్లలతో మాత్రమే మాట్లాడతారు. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటారు. 2004, మేలో అధికార పగ్గాలు మన్మోహన్ సింగ్ కి అప్పగించాలని నిర్ణయించినప్పుడు – రాహుల్, ప్రియాంకలనే సంప్రదించారు. 2006లో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్  వివాదంలో రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు కూడా వారినే సంప్రదించారు. తన అత్తగారి నుండి సోనియా రెండు పాఠాలు నేర్చుకున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే మధ్యతరగతి వారి వెంట పడితే ఏం ప్రయోజనం ఉండదు. పేద ప్రజలను ఆకర్షిస్తేనే పని అవుతుందనేది మొదటి పాఠం. రెండోది – పెళ్ళి అయిన మహిళలకు సంబంధించినది. వివాహిత మహిళలు రాజకీయాల్లోకి వస్తే చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుదనేది. జవహార్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఇంటి బాధ్యతలు చేపట్టడం వల్ల ఇందిర విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. తన భర్త రాజకీయాల్లోకి రాకూడదని ఆమె తీవ్రంగా ప్రయత్నించడానికి కారణం కూడా అదే కావచ్చు.

రాజీవ్ మరణాంతరం కాంగ్రెస్ లో ఎలాంటి పాత్ర పోషించాలనే విషయం పై సందిగ్ధతతో ఉండటానికి కూడా కారణం అదే కావచ్చు. అనేక మంది డిమాండ్ చేసినా ప్రియాంక పార్టీలోకి రాకపోవడానికి కూడా అదే కారణం కావచ్చు. ’ఆమె కాపురం.. ఆమె పిల్లలు – ఇవి రెండు చాలా ముఖ్యమైన బాధ్యతలు. ఆ తర్వాతే జాతీయ బాధ్యతలు, పార్టీ బాధ్యతలైనా అని నాతో చెప్పారు.
సోనియాకు శాశ్వత శత్రువులు ఎవరంటే రాజీవ్ను మోసం చేసిన వారైనా, ఆయన్ని ఏదో ఒక సందర్భంలో తిట్టిన వారైనా అయిఉంటారు. ఈ విషయంలో మాత్రం ఎటువంటి రాజీ ఉండదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rocket woman tessy thomas
Miss venezuela wins miss world crown  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles