Heavy rush of devotees at tirumala tirupathi devastanam

tirumala rush with devotees, tirumala heavy rush with devotees, devotees rush at tirumala, huge rush of devotees at tirumala temple, breaking news, ap politics, political news, andhra news

Heavy rush of devotees at Tirumala tirupathi devastanam

భారీగా పెరిగిన రద్దీ - 15 లక్షల..హోమం

Posted: 08/10/2013 03:13 PM IST
Heavy rush of devotees at tirumala tirupathi devastanam

వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో.. తిరుమలకు భక్తుల పోటు భారీగా పెరిగింది. తిరుమల అధికారులు ఉహించని రీతిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. ఇప్పటికే 31 కంపార్టమెంట్లు నిండి కిలోమీటర్ మేర భక్తులు క్యూలో వేచియున్నారు. అలిపిరి శ్రీవారి మెట్ల నడక వారి మార్గంలో తిరుమలకు చేరుకున్న దివ్యదర్శనం భక్తులు నారాయణగిరి ఉద్యానవనంలో 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. రూ. 300 టికెట్టు తీసుకున్న ప్రత్యేక ప్రవేశం దర్శనం భక్తుల క్యూ రెండు కిలో మీటర్ల మేర ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటలకు పైగా పడుతోంది. ప్రత్యేక దర్శనానికి12 గంటలు, కాలి నడకన చేరుకున్న భక్తులకు 15 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ద్రుష్ట్యా ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శనాన్ని తితిదే రద్దుచేసింది.

 

15 లక్షలు..

తిరుమల శ్రీవెంకటేశ్వస్వామి వారికి భక్తులు నగదు విరాళాను సమర్పించారు. నిత్య అన్నప్రసాదం ట్రస్టు కింద ఏలూరుకు చెందిన ఎ.ఎస్.రామ్ రూ. 10 లక్షలు , రంగారెడ్డి జిల్లాకు చెందిన మలక్ పేట వాసి ఐ. కవిత. రూ. లక్ష, ఔరంగాబాదుకు చెందిన బి.దత్తాత్రేయ రూ. లక్ష, ప్రాణదానం ట్రస్టు కింద హైదరాబాదుకు చెందిన కల్యాణ చక్రవర్తి లక్ష, గోసం రక్షణ ట్రస్టు కింద చెన్నైకు చెందిన మధుసూదన్, ఉషా కలిసి లక్ష, సత్యబామ లక్ష వంతున రూ. 15 లక్షలు విరాళం అందచేశారు. తిరుమల కేంద్రీయ విచారణ కార్యాలయ ఆవరణం దాతల విభాగంలో అధికారులను కలిసి విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాప్టులను భక్తులు సమర్పించారు.

 

ఉండాలని హోమం

సమైక్యాంద్రకు మద్దతుగా అన్ని కులవ్రుత్తులు, రాజకీయ పార్టీలు, జర్నలిస్టులు సంయుక్తంగా ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజల అంతా కలిసి ఉండాలని హోమం నిర్వహించారు. రహదారిపై చాకిరేవు ఏర్పాటు చేసి రజకులు బట్టలు ఉతికారు. పలువురు సమైక్యాంద్ర కోసం గుండు గీయించుకుని నిరసన తెలియజేశారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles