Mp galla aruna kumari comments over state separation

galla aruna kumari comments over state separation, galla aruna kumari comments over state, mp galla aruna kumari, over state separation mp galla aruna, breaking news, ap politics, political news, andhra new

MP Galla Aruna kumari Comments Over State Separation

గల్లా విభజన బాధ- కలిసి ఉంటే కలదు సుఖం?

Posted: 08/09/2013 08:52 PM IST
Mp galla aruna kumari comments over state separation

కలిసి ఉంటే కలదు సుఖమని, ఒకే రాష్ట్రం ఒకే భాషగా ఉండాలని రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి పేర్కొన్నారు. తన కుమారుడు జయదేవ్‌తో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌ను విడదీసి చూడలేమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటులో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కృషిని మరిచిపోవద్దని మంత్రి పేర్కొన్నారు. విగ్రహాల ధ్వంసం మంచి సంప్రదాయం కాదని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రశాంతంగా ఉద్యమిద్దామని మంత్రి గల్లా అరుణ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రజల మనోభావాలు ప్రతిబింబించేటట్లుగా మాట్లాడటం హర్షించదగ్గ విషయమన్నారు. హైదరాబాద్ అంటే అందరిదీ అనే భావం లోతుగా వుందని, అనేక వేల ఎకరాలను అమ్మేసి హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు, రెండు తరాలుగా ఇక్కడున్న వారంతా ఈ విభజనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు . హైదరాబాద్ పై అందరికీ సమాన హక్కు వుంటుందన్నారు. అందరం కలిసి పని చేయాల్సిన అవసరముందన్నారు. రేపటి నుండి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్దామన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles