Mp chinta mohan demand

mp chinta mohan, tirupati, congress party, ammahastam, employment works, Labour rate 225 rupees, villages,

mp chinta mohan demand

ఎంపి చింతామోహన్‌ రోజువారి కూలి పై డిమాండ్

Posted: 06/12/2013 03:46 PM IST
Mp chinta mohan demand

మండలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు రోజువారి కూలి 225 రూపాయలు తప్పక చెల్లించాలని ఎంపి చింతామోహన్‌ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమంలో భాగంగా ఎంపి చింతామోహన్‌ కాళంజేరి, కృష్ణాపురం, ఇంక కొన్ని గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. ప్రతి గ్రామంలో అన్ని శాఖల అధికారులతో ఆయన చర్చించి సమస్యలను ప్రజలనుండి తెలుసుకున్నారు. అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలలో ప్రగతిపై సమావేశంలో ముఖాముఖి చర్చించారు. అమ్మహస్తం సక్రమంగా అమలు చేయాలని, 185 రూపాయలకు 9 సరుకులు తప్పక ఇవ్వాలన్నారు. అంగన్‌వాడి కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారం, కోడిగుడ్లు, పాలు పంపిణీ క్రమ తప్పకుండా ఇవ్వాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కావలసిన రోడ్లు, తాగునీటి వసతి కల్పన, వీధిదీపాలు వంటి పనులకు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. అమ్మ హస్తం పథకం అమలులో సక్రమంగా 9 సరుకులు ఇవ్వడం లేదని ప్రజలు ఫిర్యాదులు చేసారు. డీలర్లను విచారించగా సరుకులకు డిడిలు చెల్లించి మూడు నెలలైనా గోదాము నుండి సరుకులు ఇవ్వలేదని, తాము ఎలా 9 సరుకులు ఇవ్వగలమని ఎంపీని అడిగారు. అన్నిసరుకులు సక్రమంగా డీలర్లకు అందేలా చర్యలు తీసుకోవాలని తహశీల్దారును ఎంపి ఆదేశించారు. దీపం లబ్దిదారులకు గ్యాస్‌ స్టవ్‌లు, సిలిండర్లను ఎంపి చింతామోహన్‌ పంపిణీ చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles