Ttd chairman kanumuri bapiraju press meet at tirumala

ttd chairman kanumuri bapiraju, kanumuri bapiraju, ttd,

TTD- Chairman kanumuri bapiraju press meet at Tirumala

తిరుమల పై కనుమూరి కితాబు..?

Posted: 06/12/2013 03:53 PM IST
Ttd chairman kanumuri bapiraju press meet at tirumala

తిరుమలలో 5 రోజులుగా నెలకొన్న విపరీత రద్దీ నేపథ్యంలో ఏర్పాట్లు బాగా చేశారంటూ సిబ్బందికి టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కితాబిచ్చారు. భక్తులకు నిరంతరాయంగా ఆహారం, తాగునీరు, అల్పాహారం, పాలు, మజ్జిగ తదితరాలను సమకూర్చడంపై ఆయన అభినందనలు తెలిపారు. తిరుమలలో బాపిరాజు మాట్లాడారు. మరికొన్ని రోజులలో వేసవి సెలవులు ముగియనుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో రూ.300, రూ.50, సర్వదర్శనం, కాలిబాట భక్తుల క్యూలైన్ల కంపార్టుమెంట్లు నిండి బయటకు మూడు కిలోమీటర్ల మేరకు లైన్లు విస్తరించాయన్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాదం, విజిలెన్స్, ఆరోగ్యశాఖ, శ్రీవారి సేవకులు.. తదితర విభాగాలు అహర్నిశలు శ్రమిస్తూ భక్తులకు విశేష సేవలను అందించారన్నారు. తద్వారా కొన్ని వేలమంది భక్తులకు దర్శనం కల్పించడానికి వీలు కలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక భక్తులు కూడా కొన్ని కిలోమీటర్ల మేరకు క్యూలైన్లలో నిలబడి.. దాదాపు 20 గంటలకు పైగా దర్శనానికి సమయం పడుతున్నా ఏ మాత్రం సహనం కోల్పోకుండా సంయమనంతో వ్యవహరిస్తూ టీటీడీకి ఎంతో సహకారం అందించారంటూ కృతజ్ఞతలు తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles