Cm n kiran kumar reddy to visit tirupati

cm n kiran kumar reddy, cm n kiran kumar reddy to visit tirupati, flowers, ants, congress party leaders,

cm n kiran kumar reddy to visit tirupati

చీమల ప్రమాదం తప్పించుకున్న సీఎం?

Posted: 04/17/2013 06:47 PM IST
Cm n kiran kumar reddy to visit tirupati

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి చీమల బెడద తృటిలో తప్పిపోయింది. కార్వేటినగరం పర్యటనలో భాగంగా తొలుత పెద్ద దళితవాడకు వెళ్ళి అక్కడ దళితులతో ముఖాముఖీ సమావేశం కావాల్సివుంది. సీఎం రాగానే ఆయనకు వేయడానికి నిర్వాహకులు భారీ పూలమాల తయారు చేయించి వేదిక సమీపంలోని కుర్చీలపై పొడవునా పరిచి ఉంచారు. కనీసం నలుగురు మోస్తేగానీ ఎత్తలేని బరువున్న ఆ భారీ పూలమాలను అధికారులెవరూ తొలుత నిశితంగా పరిశీలించలేదు. ఈలోగా జిల్లా అధికారులు కొందరు వేదిక వద్దకు వచ్చి కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో ఆ భారీ పూలమాలను కుర్చీల మీద నుంచి తీసి కింద పెట్టారు. ఆ సమయంలో పూలమాల నిండా పుట్ట పెట్టినట్టున్న చీమలను గమనించి హతాశులయ్యారు. మరో పది నిమిషాలలో ముఖ్యమంత్రి రాబోతారనగా అధికారులు ఈ సంగతి గుర్తించారు. సీఎం వచ్చేలోగా పూలమాల నిండా వున్న చీమలను విదిలించడం సాధ్యం కాదని గుర్తించి దాన్ని తీసుకెళ్ళి వేదిక వెనుకవైపు పారవేశారు. సకాలంలో గుర్తించకుండా పూలమాలను ముఖ్యమంత్రికి వేసివుంటే ఎంత ఇబ్బంది తలెత్తేదోనని అధికారులు చర్చించుకోవడం కనిపించింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles