Pickpocketer in tirupati balaji temple

pickpocketer in tirupati balaji temple, tirumala venkateswara temple, devotee ramkumar in newdelhi, 85thousand theft, tirupati police, ram kumar agarwal,

pickpocketer in tirupati balaji temple

దేవుడి ముందే భక్తుల డబ్బులు దోచుకున్న దొంగ?

Posted: 04/17/2013 07:13 PM IST
Pickpocketer in tirupati balaji temple

శ్రీవారి ఆలయంలోనే దొంగలు స్వేచ్చగా తిరుగుతున్నారు. క్యూలో ఉన్న భక్తులను నిలువు దోచుకుంటున్నారు.  శ్రీవారి హుండీలో వేద్దామని తెచ్చిన నగదు దొంగలపాలవుతుందని బాధితులు వాపోతున్నారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే భారీ దొంగతనం జరిగింది.  న్యూఢిల్లీకి చెందిన  వ్యాపారి  రాంకుమార్  అగర్వాల్ అనే భక్తుడు కుటుంబ  సభ్యులతో  కలిసి ప్రత్యేక  ప్రవేశం  దర్శనం  టిక్కెట్ల ద్వారా  శ్రీవారిని దర్శించుకున్నారు.  స్వామి దర్శనానంతరం  తన జేబును ఉన్న 85 వేల నగదు కనిపించలేదు. శ్రీవారి హుండీలో సమర్పించడానికి తీసుకువచ్చిన నగదు కనిపించడంలేదంటూ కలత చెందిన భక్తుడు నిఘా, భద్రతా  విభాగం సిబ్బంది ద్రుష్టికి తెచ్చారు.  వెంటనే అధికారు స్పందించి సీసీ కెమెరాల ద్వారా రికార్డు అయిన ద్రుశ్యాలను పరిశీలించి,  నిందితుడిన్ని గుర్తించారు.రాంకుమార్ అగర్వాల్ తన వెంటన రెండు లక్షల రూపాయాలు  తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎడమ వైపు జేబులో ఉన్న నగదు చోరీ జరిగిందని భాదితుడు చెబుతున్నాడు.  నిందితుడిన్ని  పట్టుకోవడానికి  పోలీసులు రంగంలోకి దిగారు. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles