Congress senior leader fire on cm kiran

congress senior leader, cm kiran, tirupati, congress party,

congress senior leader fire on cm kiran

పదవుల్లేకుండా జనం ఎలా వస్తారు?

Posted: 04/13/2013 06:32 PM IST
Congress senior leader fire on cm kiran

'నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. తిరుపతిలో ఏ మాత్రం కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అధికారుల వద్ద విలువ లేదు. ఎవరూ చెప్పిన పని చేయడం లేదు. మనకంటే వైసీపీ నాయకులకే అన్ని పనులు అవుతున్నాయి. అలాంటప్పుడు సీఎం సభకు మాత్రం క్యాడర్ అంతా రావాలంటే ఎలా' అం టూ పలువురు మంత్రి పార్థసారథి వద్ద ఆవేదన వెళ్లగక్కారు. కార్వేటి నగరంలో ఈనెల 14న జరిగే సీఎం సభకు జన సమీకరణపై తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మంత్రి గల్లా అరుణకుమారితోపాటు మాజీ ఎమ్మెల్యేలు వెంకటరమణ, ఎస్సీవీ నాయుడు, మాజీ మంత్రి చెంగారెడ్డి, ఎమ్మెల్సీ జయచంద్రనాయుడు, నేతలు నవీన్‌కుమార్‌రెడ్డి, శంకరరెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులతో పార్థసారథి సమావేశమ య్యారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సదస్సుకు జనాన్ని తీసుకొచే ్చ బాధ్యత మీదేనని చెప్పారు. యూత్ కాంగ్రెస్, పార్టీ క్యాడర్, కార్యకర్తలను ఎక్కువ సంఖ్యలో సమీకరిం చుకుని సీఎం సభకు తీసుకు రావాలన్నారు. ప్రతి సారి డ్వాక్రా మహిళలను తరలించి మనం వెనుక ఉండటం కాదు.. ఈ సారి వార్డుల వారీగా క్యాడర్ సీఎం సభలో కనపడాలని చెప్పారు.ఈ సందర్భంగా పలువురు నేత లు, కార్యకర్తలు నామినేటడ్ పదవులను ప్రస్తావించారు. ఇటీవవల కడపకు చెందిన వైఎస్ మధుసూదన్ రెడ్డి అనుచరులు భూ కబ్జాకు పాల్పడితే పోలీసులు బాధితు లకు న్యాయం చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ వారికే విలువ ఇస్తున్నారన్నారు. మనం అధికారంలో ఉండి ఏం లాభం.. పనీపాటా కానప్పుడు పార్టీలో ఉండి ఏం లాభమంటూ నిలదీశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles