Street light in cm kiran kumar reddy village

cm kiran kumar reddy, kanthi kiranalu, peeleru, village street lights,

street light in cm kiran kumar reddy village

సీఎం నియోజకవర్గంలో అడవికాచిన వెన్నెల?

Posted: 04/13/2013 06:20 PM IST
Street light in cm kiran kumar reddy village

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో 'ప్రతి స్తంభానికీ వీధిదీపం' నినాదంతో ప్రవేశపెట్టిన 'కాంతికిరణాలు' పథకం కొడిగట్టుతోంది. ఈ పథకం కింద నియోజకవర్గ కేంద్రం పీలేరుతోపాటు మిగతా అయిదు మండలాల్లో చాలా గ్రామాల్లో వీధివీధినా.. పోలుపోలుకూ విద్యుద్దీపం ఏర్పాటు చేశారు. ఇందుకోసం పడా నిధులనుంచి రూ. ఏడున్నర కోట్లు ఖర్చుపెట్టారు. అయితే.. నిర్వహణ సరిగా లేకపోవడంతో కొన్నిచోట్ల ఈ దీపాలు అడవికాచిన వెన్నెలలా మారిపోగా, మరికొన్ని చోట్ల కారుచీకట్లను కురిపిస్తున్నాయి. ఆధునిక రీతిలో అమర్చిన ఈ దీపాలను ప్రత్యేకించి ఆర్పే పనిలేకుండా గ్రామానికి ఒకచోట స్విచ్‌కు బదులు 'టైమర్లు' ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని కాలిపోగా, మరికొన్ని సాంకేతిక కారణాలతో పనిచేయడం లేదు. దీంతో కొన్ని గ్రామాల్లో కరెంటు ఉన్నంతసేపు పగలు- రాత్రి తేడాలేకుండా దీపాలు వెలుగుతుండగా, కొన్నిచోట్ల అసలే వెలగడం లేదు. మరికొన్ని చోట్ల రాత్రి పూట ఆరిపోయి పగలు వెలుగుతున్నాయి.  సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో 'ప్రతి స్తంభానికీ విద్యుద్దీపం' నినాదంతో ప్రవేశపెట్టిన 'కాంతికిరణాలు' పథకం కొడికడుతోంది. కొన్ని గ్రామాల్లో కరెంటు ఉన్నంతసేపు పగలు- రాత్రి తేడాలేకుండా దీపాలు వెలుగుతుండగా, కొన్నిచోట్ల అసలే వెలగడం లేదు. మరికొన్ని చోట్ల రాత్రి పూట ఆరిపోయి పగలు వెలుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles