Liquor fight in tirupati

bhumana fight against liquor in tirupati, bhumana karunakar reddy, ysrcp mla, high court,

liquor fight in tirupati. Bhumana Fight Against Liquor in Tirupati

తెర మీదకు మళ్లీ మద్య నిషేధం

Posted: 04/09/2013 07:37 PM IST
Liquor fight in tirupati

పుణ్యక్షేత్రంలో అర్ధరాత్రి దాటాక భోజనం లభించని పరిస్థితులైనా కనిపిస్తాయి గానీమద్యం అమ్మకాలు మాత్రం నిరంతరం సాగుతూనే ఉన్నాయి. తిరుపతి నగరంలో మద్యపాన నిషేధం అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో మళ్లీ చర్చ మొదలైంది. తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రత దృష్ట్యా తిరుపతిలో మద్యపాన నిషేధం విధించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అనేక ప్రజాసంస్థలు ప్రభుత్వాల మీద ఈ మేరకు ఒత్తిడి తెచ్చినా సాధ్యాసాధ్యాల పరిశీలన పేరుతో ఈ ప్రతిపాదన వాయిదా పడుతూనే వస్తోంది. తిరుపతిని మద్య రహిత నగరంగా మార్చాలని సురాజ్యం సంస్థకు చెందిన డాక్టర్ వేణుగోపాల్ తదితరులు గతంలో అనేక మంది ప్రముఖుల మద్దతుతో ప్రభుత్వంమీద ఒత్తిడి తెచ్చారు. తిరుపతిలో 40 మద్యం దుకాణాలు, 18 బార్లులెక్కకు మించిన బెల్ట్ షాపులు ఉన్నాయి.  రైల్వే స్టేషన్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లోని మద్యం షాపులు యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నాయి. తిరుపతిలో రోజుకు రూ.60 లక్షల నుంచి 70 లక్షల వరకు మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. తిరుపతిని మద్య రహిత నగరంగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి నిరవధిక నిరసన చేశారు. గత ఏడాది మద్యం దుకాణాల వేలం జరిగిన సమయంలో తిరుపతిలో పాక్షిక మద్య నిషేధం అమలు చేస్తామని చెబుతూ ప్రభుత్వం తిరుమల బైపాస్ రోడ్డులోని మద్యం దుకాణాలను నగరంలోని వివిధ ప్రాంతాలకు మార్చింది. దీంతో ఆ మార్గంలోని బార్లకు వ్యాపారం మరింత పెరిగింది.

తిరుమల బైపాస్ రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణం ఏర్పాటు చేశారనీనగరంలో మద్యం అమ్మకాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ నెమ్మలి సారథిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందిస్తూ తిరుపతిలో మద్యం అమ్మకాలు నిషేధించడానికి వున్న ఇబ్బందులేమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ పరంపరలోనే అభినయ్‌రెడ్డి తిరుపతిని మద్య రహిత నగరంగా మార్చే లా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు 15వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles