Ttd fake accounts in facebook

ttd fake accounts in facebook, Tirumala Tirupati Devasthanams, facebook,

ttd fake accounts in facebook

ttd-fake-accounts.gif

Posted: 03/05/2013 06:33 PM IST
Ttd fake accounts in facebook

ttd fake  accounts in facebook

ఫేస్‌బుక్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో శ్రీవారి చిత్రాలతో కూడిన నకిలీ ఖాతాలు వందల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి టీటీడీ అధికారికంగా నిర్వహిస్తున్న వెబ్‌సైట్లు :www.tirumala.org, www.tirupati.org, టీటీడీ కాల్‌సెంటర్: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it., సేవలు, వసతి ఆన్‌లైన్ బుకింగ్: www.ttdsevaonline.com మాత్రమే. అయితే, కొందరు వ్యక్తులు దేవదేవుని, టీటీడీ పేరుతో ఖాతాలు తెరిచేశారు. అందులో తమ ఫొటోలకు బదులు శ్రీవారు, టీటీడీ లోగోలు కూడా పొందుపరిచేశారు. టీటీడీ వెబ్‌సైట్లలో ఉన్న కొంత సమాచారాన్ని తమ సైట్లకు అనుసంధానం చేశారు. వీటిద్వారానే తమ వ్యక్తిగత సమాచారం, కార్యక్రమాలు, ఫొటోలు కూడా పొందుపరిచి టీటీడీ ఖాతాలతో విస్తృత ప్రచారం పొందుతున్నారు. వీటిని టీటీడీ అధికారిక ఎకౌంట్లుగా భావించి భక్తులు వాటి ద్వారా ఆన్‌లైన్ నగదు వ్యవహారాలు సాగించే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. గతంలో టీటీడీ అధికారికంగా నిర్వహించిన ఈ-హుండీపై కూడా ఆరోపణలు ఉండగా, తాజాగా వెలుగుచూసిన ఫేస్‌బుక్ నకిలీ ఖాతాలపై దేవస్థానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Srigandha tree plantation
Sri kalyana venkateshwara swami temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles