Srigandha tree plantation

srigandha trees plantation in ttd

srigandha trees plantation in ttd

srigandha tree plantation.png

Posted: 03/08/2013 08:35 PM IST
Srigandha tree plantation

కలియుగ వైకుంఠనా«థుడైన శ్రీనివాసుడికి వేకువజామున జరిగే సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే పూజా కైంకర్యాలలో అనేక సుగంధ పరిమళ ద్రవ్యాలను వినియోగిస్తారు. శ్రీగంధం, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, కస్తూరి, పునుగు తైలం, పసుపు వంటి ద్రవ్యాలను నిత్యం స్వామివారి పూజల్లో వినియోగిస్తారు.

వీటిలో శ్రీగంధానికి ఒక ప్రత్యేకత వుంది. శ్రీవారి సుప్రభాత సేవతో పాటు ఏకాంతసేవలో కూడా స్వామివారికి శ్రీగంధంతో పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. శ్రీవారికి వినియోగించే చందనాన్ని ఆలయంలోని వాయవ్య మూల వున్న చందనపు అరలో తయారు చేస్తారు. సానరాళ్ళమీద గంధం చెక్కలను అరగదీసి, మెత్తని చందన లేపాన్ని పరిచారికలు తయారు చేస్తారు.ఇలా తయారు చేయబడిన రెండు చందనపు ముద్దల్లో ఒక దాన్ని శ్రీవారి మూలవిరాట్టు దివ్యపాదాల పైనా, సగం ముద్దను శయన మండపంలో బంగారు మంచంపై పవళించివున్న భోగశ్రీనివాసమూర్తి వక్షస్థలం పైనా, పావువంతు ముద్దను శ్రీవారి మూలమూర్తి వక్షస్థలంపై వున్న శ్రీమహాలక్ష్మి అమ్మవారికి, మిగిలిన పావు భాగం చందనపు ముద్దను ఏకాంత సేవానంతరం రాత్రి బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామివారికి అర్పించేందుకు గాను మూలమూర్తి ముందర ఒక బంగారు పళ్ళెంలో ఉంచుతారు. రోజురోజుకూ శ్రీగంధానికి డిమాండ్ పెరిగిపోతుండడంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తిరుమలలోనే శ్రీగంధం వనాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు .

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A hair raising story of tirupathi
Ttd fake accounts in facebook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles