Sri kalyana venkateshwara swami temple

Sri Kalyana Venkateshwara Swami Temple

Sri Kalyana Venkateshwara Swami Temple

Sri Kalyana Venkateshwara Swami Temple.png

Posted: 02/28/2013 08:03 PM IST
Sri kalyana venkateshwara swami temple

templeశ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి మహర్దశ కలగనుంది. అభివృద్ధి పనులకు ఆర్కియాలజీ విభాగం (పురావస్తుశాఖ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం 15వ శతాబ్దానికి చెందింది. ఈ ఆలయం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉంది. అందువల్ల ఇది అభివృద్ధి పనులకు నోచుకోలేదు. పెరుగుతున్న భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేపట్టాలని టీటీడీ భావించినా పురావస్తుశాఖ అడుగడుగునా అభ్యంతరాలు చెబుతోంది.అయినప్పటికీ భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న సత్సంకల్పంతో టీటీడీ మాస్టర్‌ప్లాన్‌కు తెరతీసింది. ఆలయం చుట్టూ 18 ఎకరాల భూసేకరణ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆ ప్రాంతంలో నివాసాలు, దుకాణాలు, వ్యవసాయం చేసేవారికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో టీటీడీ ఈవో ఎల్‌వీ సుబ్రమణ్యం మంగళవారం ఢిల్లీలోని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డెరైక్టర్ జనరల్ ప్రవీణ్ శ్రీవాత్సవతో చర్చించారు. పురాతన ఆలయానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు, భక్తుల కోసం మౌలిక వసతుల కల్పనకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించి సఫలీకృతులయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ttd fake accounts in facebook
Saina nehwal visits srikalahasti  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles