Tirumala tirupati darshan

tirumala tirupati darshan.png

Posted: 01/02/2013 06:57 PM IST
Tirumala tirupati darshan

TTDసామాన్య భక్తులకు కూడా శ్రీవారిని అతి సమీపం నుంచి దర్శించుకునే భాగ్యం కల్పించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.చాతాండంత క్యూ లైన్‌. తోపులాటలు.. కొన్ని సెకన్ల పాటు కూడా తిరుమల శ్రీవారిని కనులారా చూడలేకపోతున్నారు భక్తులు. నామాలు తప్ప ... శ్రీవారి రూపం అంత స్పష్టంగా కనిపించదు. ఎక్కడో 67 అడుగుల దూరం నుంచి దర్శనం చేసుకోవాల్సి వస్తోంది. ఈ బాధలన్ని ఈ కొత్త సంవత్సరంలో తీరనున్నాయి. సామాన్య భక్తులకు కూడా స్వామి వారిని అతి సమీపం నుంచి దర్శనం భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.ప్రస్తుతం శ్రీవారికి అతి సమీపంలో ఉన్న ద్వారం కులశేఖరపడి నుంచి అతిథులు, సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి దర్శనం కల్పిస్తున్నారు.రాములవారి మేడ దగ్గర నుంచి ఇది 30 అడుగుల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి గంటకు 1600 మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఇలా రోజుకు 30 నుంచి 40వేల మంది వరకు దర్శించుకోవచ్చు.తాజా ప్లాన్‌ ప్రకారం... గర్భాలయంలో మార్పులు తీసుకువచ్చి 30 అడుగుల దూరం నుంచే స్వామివారి దర్శనానికి యోచిస్తున్నారు. రాముల వారి మేడకు అటు ఇటుగా ద్వారాలను ఏర్పాటు చేస్తే ఏడుకొండల వాడి ప్రభావం ఏమాత్రం తగ్గిపోదని భావిస్తున్నారు. రాములవారి మేడ ముందు ద్వారాలు ఏర్పాటు చేస్తే... దర్శనం అనంతరం ఉత్తర ద్వారం నుంచి బయటకు రావచ్చు.  గతంలో ఎసీ గొట్టాలను అమర్చేందుకు ఏర్పాటు చేసిన రంధ్రాన్ని పెద్దది చేస్తే సరిపోతోందని ఆలోచన చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ttd issues 15000 biometric tokens
Ttd arrangements for new year  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles