Vigilance officers arrest ttd kalyana katta barbers

vigilance officers arrest ttd kalyana katta barbers

vigilance officers arrest ttd kalyana katta barbers

vigilance officers arrest ttd kalyana katta barbers.png

Posted: 12/11/2012 06:45 PM IST
Vigilance officers arrest ttd kalyana katta barbers

తిరుమలలోని ప్రధాన కల్యాణకట్టపై టీటీడీ విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. తలనీలాలు సమర్పించే సమయం లో భక్తుల నుంచి బలవంతంగా నగదు వసూలు చేస్తున్న 20 మంది క్షురకులను అదుపులోకి తీసుకున్నారు. నిఘా విభాగం ఉన్నతాధికారులు వారిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ప్రతిరోజూ ఏ మేరకు ఇలా భక్తుల నుంచి వసూళ్లు చేస్తున్నారు.. ఎవరెవరికి వాటాలు అందుతున్నాయి.. నెలలో ఏస్థాయిలో వసూళ్లు జరుగుతున్నాయి.. నగదు ఎంతమంది చేతులు మారుతోందనే వివరాలను వారి నుంచి రాబట్టినట్లు సమాచారం.ఈ వ్యవహారంలో పెద్దల హస్తం కూడా ఉన్నట్లు తెలియడంతో విషయాన్ని విజిలెన్సు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. గత శుక్రవారం 'డయల్ యువర్ ఈవో' కార్యక్రమంలో కోల్‌కతాకు చెందిన వెంకట్రావు అనే భక్తుడు టీటీడీలో జరుగుతున్న అవినీతిపై వివరంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఈవో దాడులకు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ttd initiative to book for rooms thru online
Papavinasanam toll gate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles