Papavinasanam toll gate

Papavinasanam Toll Gate

Papavinasanam Toll Gate

Papavinasanam Toll Gate.png

Posted: 12/08/2012 05:12 PM IST
Papavinasanam toll gate

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను నిట్ట నిలువునా దోచుకుంటున్నారు. పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. తిరుమలేశుడి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలపై డబ్బు వసూలుకు అలిపిరి వద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేసింది టీటీడీ. అలిపిరి నుంచి కొండపైకి  22 కిలోమీటర్లు దూరానికి వాహనాన్ని బట్టి కనిష్టంగా 2 రూపాయల నుంచి 50 దాకా వసూలు చేస్తున్నారు. అలా వసూలు చేసిన డబ్బంతా టీటీడీ ఖాతాలోకి వెళ్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే  భక్తులు పాప ప్రక్షాళన కోసం కొండపైనున్న పాపవినాశనానికి  వెళ్తారు.   రిజర్వు ఫారెస్ట్ లో వెళ్లాల్సిన సూమారు రెండు కిలో మీటర్ల దూరానికి 5 నుంచి 30 రూపాయల దాకా భక్తులనుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు అటవీ శాఖాధికారులు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ప్రభుత్వం నుంచి ఈ టోల్‌గేట్ కు ఎలాంటి పర్మిషన్ లేదు. అయితే ఈ బాగోతం 2009 నుంచి యదేఛ్చగా సాగుతోంది. ఈ టోల్‌గేట్‌ ద్వారా నెలకు దాదాపు కోట్ల రూపాయలు భక్తుల నుంచి కొల్లగొడుతున్నారు. టోల్ ఫలితంగా ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాన్ని సాకుగా చూపుతూ భక్తులనుంచి అదనంగా వసూలు చేస్తున్నారు.అటవీ శాఖ అనధికారంగా టోల్ ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ,ప్రభుత్వం దృష్టి సారించి అక్రమ టోల్‌ను అరికట్టాలని కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vigilance officers arrest ttd kalyana katta barbers
Tirumala papavinasanam dam full  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles