వసతి కావలసిన అతిథి తానే స్వయంగా కంప్యూటర్ ద్వారా గది పొందే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. 'క్రియాస్' అనే ఈ విధానాన్ని తిరుమలలోని పద్మావతి ఉప విచారణ కార్యాలయంలో మంగళవారం ప్రారంభించింది. భక్తుల సౌకర్యార్థం గదుల కేటాయింపుల్లో మరింత పారదర్శకత కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు టీటీడీ తెలిపింది. దీనిని తొలుతగా ఎస్ఎంజీహెచ్, ఆదిశేషు, శ్రీచక్ర, సన్నిధానం విశ్రాంతి భవనాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. దీనికి తొలిరోజు నుంచే భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. కార్యక్రమాన్ని జేఈవో శ్రీనివాసరాజు, రిసెప్షన్ డిప్యూటీఈవో వెంకటయ్య, దామోదరం తదితరులు పర్యవేక్షిస్తున్నారు.
'క్రియాస్' విధానంలో గదులు పొందే భక్తులు ముందుగా వివిధ విశ్రాంతి భవనాల్లో ఖాళీగా ఉన్న గదుల వివరాలను కంప్యూటర్ ద్వారా తెలుసుకోవాలి. అనంతరం తనకు నచ్చిన అద్దె గదిని ఎంచుకోవాలి. తర్వాత తన చిరునామా, సెల్‌ఫోను నంబరు, వేలి ముద్ర, ఫొటోను కంప్యూటర్‌లో పొందుపరిచాక రశీదు వస్తుంది. ఆ రశీదును తీసుకుని పక్కనున్న కౌంటర్ వద్ద మరోసారి అదే వేలిముద్ర, ఫొటోను ఇచ్చి నగదు చెల్లించి గది పొందవచ్చు. ఇదంతా 40 నిమిషాల్లోపే అయిపోతుంది. కాబట్టి సమయం వృధా కాదు. గది అద్దెను నగదుగా లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల రూపంలోనూ చెల్లించే సదుపాయం కల్పించారు. ఈ విధానంలో కూడా గది పొందిన భక్తులు తర్వాత 15 రోజుల వరకు మళ్లీ గది తీసుకోవడం వీలుపడకుండా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. సాధారణంగా అతిథి గృహాల్లో గది పొందాలంటే సిఫార్సు లేదా అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. వాళ్లు కేటాయించిన గదినే తీసుకోవాలి. ఇప్పుడు ఖాళీలను చూసి భక్తులే నేరుగా తమకు నచ్చిన గది పొందే సౌలభ్యం ఏర్పడింది.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more