The Making Of Chicken Haleem | Ramzan Festival Special Foods | Making Of Foods

Chicken haleem making tips ramzan special foods

chicken haleem, chicken haleem tips, haleem making tips, chicken haleem making tips, ramzan month, ramzan festival, ramzan special foods, chicken haleem making methods, ramzan recipes, ramzan food items, chicken recipes, chicken haleem party, mutton haleem, mutton haleem making tips, mutton haleem tips

Chicken Haleem Making Tips Ramzan Special Foods : The Making Tips Of Tastiest Chicken Haleem In Home Which Is A Special Food In Holy Month Of Ramzan. This is The Tastiest Recipe In Whole Month Which People Like To Eat This.

నోరూరించే ‘చికెన్ హలీమ్’ తయారీ విధానం

Posted: 07/06/2015 12:41 PM IST
Chicken haleem making tips ramzan special foods

ముస్లింల పవిత్రమాసమైన ‘రంజాన్’ సందర్భంగా ఎన్నోరకాల రుచికరమైన వంటకాలు ప్రత్యేకంగా చేసుకుంటారు. అందులో ముఖ్యమైంది ‘హలీమ్’. చికెన్, మటన్, వెజిటేరియన్.. ఇలా రకరకాల్లో వండుకునే ఈ ఆహారాన్ని ప్రతిఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే.. నెలరోజులు మాత్రమే ఈ హలీమ్ తినడానికి అందుబాటులో వుంటుంది కాబట్టి.. అందరూ ఎగబడి మరీ తింటుంటారు. ఈ రుచికరమైన ఆహారాన్ని ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చు. దీనిని తయారీ చేయడంలో కాస్త సమయం పట్టినా.. సులువుగానే ముగించేయొచ్చు. దీనిని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందామా..

కావలసిన పదార్థాలు :

బోన్ లెస్ చికెన్ - 500 gms;
గోధుమ రవ్వ - 250 gms;
సెనగపప్పు - పిడికెడు;
బియ్యం - పిడికెడు;
పచ్చిమిర్చి - 5;
అల్లం వెల్లుల్లి ముద్ద - 2 tsp;
పసుపు - 1 tsp;
కారం పొడి 2 tsp;
గరం మసాలాపొడి - 1 tsp;
మిరియాలపొడి - 1/2 tsp;
సొంటి పొడి - 1/2 tsp;
నారీ మసాలా లేదా పోట్లీ మసాలా - 1;
చిన్న పాకెట్ పుదీనా;
కొత్తిమిర - 1/2 కప్పు;
ఉల్లిపాయ - 2;
లవంగాలు - 8;
దాల్చిన చెక్క - 3 / 4 ముక్కలు;
యాలకులు - 8;
షాజీరా - 2 tsp;
పెరుగు - 1 కప్పు;
ఉప్పు - తగినంత;
నూనె - 1/4;
కప్పు నెయ్యి - 5 tbsp

తయారుచేయు విధానం :

* మొదట చికెన్ ముక్కల్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌవ్ మీద కుక్కర్ పెట్టి అందులో చికెన్ ముక్కలు, సెనగపప్పు, బియ్యం, చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద, సగం యాలకులు, లవంగాలు, దాల్చిన, షాజీరా, సగం పుదీనా, రెండు పచ్చిమిర్చి, కొత్తిమిర, సగం చెంచాడు పసుపు, నారీ మాసాలా లేదా పోట్లీ మసాలా ఒక సన్నటి బట్టలో మూతకట్టి వేయాలి. అనంతరం తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి.

* నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఆ పదార్థాల మిశ్రమాన్ని బాగా ఉడికించాలి. విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి లావాటి గోధుమ రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం మూతపెట్టి.. మళ్లీ నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. బాగా ఉడికించిన తర్వాత కుక్కర్ ను స్టౌవ్ మీద నుంచి క్రిందకు దించి.. చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పొట్లీ మసాలా మూట తీసేసి.. మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.

* ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను స్టౌవ్ మీద పెట్టి.. అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీర , అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన పచ్చిమిర్చి బాగా నూరుకొని వేయాలి. కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా కారం పొడి, మిరియాలపొడి, సొంటిపొడి, గరం మసాలాపొడి వేసి కలుపుతూ వేయించాలి. తర్వాత ఇందులో కప్పుడు పెరుగు వేసి కలపాలి. తర్వాత ఇందులో ఇదివరకు గ్రైండ్ చేసుకున్న చికెన్ మిశ్రమం, తగినంత ఉప్పు వేసి చిన్న మంటమీద కలుపుతూ ఉడికించాలి.

* మరోవైపు.. ఒక గిన్నెలో కొద్దిగా నూనె పోసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిగిలిన కొత్తిమిర, పుదీనా వేసి కరకరలాడేలా వేయించి పెట్టుకోవాలి. హలీమ్ మొత్తం ఉడికి మంచి వాసన వస్తున్నప్పుడు నెయ్యి వేసి కలిపి మరి కొద్దిసేపు ఉంచాలి. మొత్తం ఉడికి నూనె, నెయ్యి కలిసి పైకి తెలుతుండగా క్రిందకు దించేయాలి. అంతే.. చికెన్ హలీ రెడీ. ఆ హలీమ్ ను సర్వింగ్ బౌల్‌లో వేసి వేయించిన ఉల్లిపాయ, కొత్తిమిర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chicken Haleem  Mutton Haleem  Haleem Foods  Ramzan  

Other Articles

  • Chicken garelu cooking tips which is special weekend food

    నోరూరించే చికెన్ గారెల తయారీ...

    Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more

  • Chicken lollipops cooking tips best healthy food recipes

    చికెన్ లాలీ పాప్స్ ని ఎలా చేస్తారో తెలుసా..?

    Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more

  • Butter garlic fish fry recipe cooking methods kitchen tips

    బట్టర్ గార్లిక్‌తో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో తెలుసా?

    Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more

  • Rice vada cooking method kitchen tips

    బియ్యపు పిండితో వేడివేడి వడలు..

    Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more

  • Chicken garelu recipe cooking tips healthy food items nov veg

    చల్లని వెదర్ లో హాట్ చికెన్ గారెలు..

    Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more