సహజంగా ప్రతిఒక్కరు వీకెండ్ రాగానే రెస్టారెంట్లకు, హోటళ్లకు, తినుబండారాలు వున్న చోట్లకు కొన్ని ప్రత్యేకమైన రుచులను, ఆహార పదార్థాలను ఆస్వాదించడానికి వెళతారు. మరికొందరు తమతమ ఇళ్లల్లోనే ప్రత్యేకంగా కొన్ని వంటకాలను తయారుచేసుకోవడానికి ఇష్టపడతారు. ఇటువంటి వారికి వీకెండ్ స్పెషల్ రిసిపీ ఈ మసాలా చికెన్ రైస్.
ఈ చికెన్ మసాలా రైస్ ఇతర ఆహారపదార్థాలకంటే ఎంతో భిన్నంగా, రుచికరంగా వుంటుంది. పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు దీనిని తినడానికి చాలా ఉత్సాహంగా వుంటారు. ఇది చాలా రకాల స్పైసీ ఫ్లేవర్ తో తయారుచేస్తారు. ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే దీనిని ఇండియన్ ఫ్రైడ్ రైస్ గా చెప్పుకోవచ్చు. దీనిని తయారుచేయడంలో ఎక్కువ సమయం కూడా పట్టదు.
కావలసి పదార్థాలు :
1. చికెన్ : ఒక కప్పులో సరిపోయేంత చికెన్ ముక్కలు
2. అన్నం : 2 కప్పులు
3. గుడ్లు : 2
4. అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
5. పుదీనా : 1/2 కప్
6. కొత్తమీదర : 1/2 కప్
7. ఉల్లిపాయలు : 1 లేదా 2
8. పచ్చిమిర్చి : 2 (రుచికి సరిపడే మోతాదులో)
9. టమోటాలు : 1 లేదా 2
10. కరివేపాకు : ఒక రెమ్మ
11. పసుపు : తగినంత
12. నూనె : 2 టేబుల్ స్పూన్స్
13. ఉప్పు, కారం : సరిపడేంత
14. గరం మసాలా పొడి : 1 టేబుల్ స్పూన్
పావు మిశ్రమం కోసం :
1. లవంగాలు : 2
2. దాల్చిన చెక్క : ఒక చిన్న ముక్క
3. షాజీర : కొద్దిగా
తయారుచేసే విధానం :
1. ముందుగా తీసుకున్న చికెన్ ను నీటిలో బాగా శుభ్రం చేసుకుని, అందులో వున్న బోన్స్ తీసివేయాలి. తరువాత చిటికెడు ఉప్పు, కారం వేసి కొద్దిసేపు వరకు ఉడికించి, ఒక పక్కన పెట్టుకోవాలి.
2. ఒక పెనుమును తీసుకుని, అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనెను పోసి వేడి చేసుకోవాలి. తరువాత అందులో కోడిగుడ్లను వేసి... పొడిపొడిగా ఉడికించుకుని పక్కకు తీసుకోవాలి.
3. ఇంకొక పెనుమును తీసుకుని అందులో కొద్దివరకు నూనెను పోసి స్టౌ మీద వేడి చేసుకోవాలి. అందులో లవంగాలు, చెక్క, షాజీరాలను వేయాలి. తరువాత సన్నగా తరుముకున్న ఉల్లిపాయలను, మిర్చిలను వేసి బాగా పండేంతవరకు వేయించాలి.
4. ఇలా కొద్దిసేపు బాగా వేయించిన తరువాత అందులో కరివేపాకు, తరిగిన టమోటా ముక్కలను వేయాలి. టమోటాలు బాగా మగ్గిన తరువాత అందులో తరిగిన పుదీనా, కొత్తమీద వేసి కొద్దిసేపటివరకు వేయించాలి. కొద్దిసేపు తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి ఉడికించాలి.
5. పైన తయారుచేసుకున్న మిశ్రమమంతా బాగా వేడి అయిన తరువాత అందులో ఇంతకుముందు వేడిచేసుకున్న చికెన్ ముక్కలను వేయాలి. అందులో పొడిగా ఉడికించుకున్న గుడ్లను వేసి రుచికి సరిపడేంత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు నిముషాలవరకు వేడి చేసుకోవాలి.
6. తరువాత అందులో రెండు కప్పుల అన్నం వేసి వేయించుకోవాలి. చివరగా అందులో రుచికి సరిపడేంత ఉప్పు, గరంమసాలా పొడిని వేసి కలుపుతూ వేడి చేసుకోవాలి.
ఇలా ఈ విధంగా వేడి చేసుకున్న తరువాత అందులో కొద్దివరకు కొత్తిమీరను పైన చల్లుకుంటే చాలు.. నోరూరించే స్పైసీ చికెన్ రిసిపీ తయారయిపోతుంది.
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more