Experts Giving Simple Health Tips To Control And Reduce Body Weight | Health Home Remedies

Simple health tips to control and reduce body weight

weight loss tips, tips to control weight, weight control tips, remedies to control weight, weight control remedies, health tips, body health tips, health home remedies

Simple Health Tips To Control And Reduce Body Weight : Experts Giving Simple Health Tips To Control And Reduce Body Weight.

శరీర బరువు తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

Posted: 10/17/2015 11:15 AM IST
Simple health tips to control and reduce body weight

లావుగా వున్నవాళ్లు తమ శరీర బరువును తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి మందల ద్వారా తమ బరువను కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధపడతారు. అయితే.. వాటివల్ల ప్రమాదం వుండవచ్చు. సాధారణంగానే శరీర బరువు తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే చాలని, రెగ్యులర్ గా చేస్తే బరువు తగ్గవచ్చునని చెబుతున్నారు.

* ప్రతి రోజు ఉదయాన్నే కడుపారా అల్పాహారాన్ని సేవించాలి. ఇలా తినడం వల్ల.. రోజంతా ఉత్సాహంగా వుండటంతోపాటు అన్ని కార్యకలాపాల్లో ఉత్తేజంగా పాల్గొనేందుకు అవసరమైన శక్తి లభిస్తుంది.
* ప్రతి రోజు దాదాపు ఎనిమిది నుంచి పది లీటర్ల మేరకు నీటిని సేవించాలి. నీటిలో ఎలాంటి క్యాలరీలుండవు కాబట్టి.. శరీర బరువు కంట్రోల్ లోనే వుంటుంది.
* తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలుండేలా జాగ్రత్తలు వహించాలి. వీటీలో విటమిన్లు, ఖనిజపదార్థాలు పుష్కలంగా ఉంటాయి.  
* పగటిపూట మధ్య-మధ్యలో ఆహారాన్ని తీసుకోవాలి. కాని ఇందులో వేపుడు పదార్థాలను మాత్రం తీసుకోకండి.
* నాజూకుగా లేదా బరువు తగ్గేందుకు మరీ విపరీతంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. బరువు తగ్గడం మాటటుంచితే శరీరానికి అలసట తప్ప మరోటి ఉండదు.
* శారీరక వ్యాయామంలో భాగంగా సైకిలింగ్, జాగింగ్, స్విమ్మింగ్ చేయండి. దీంతో శరీరంలో పేరుకుపోయిన పనికిరాని కొవ్వు కరిగిపోతుంది.
* కార్యాలయంలో లేదా అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ఉపయోగించేకన్నా మెట్లు ఎక్కడమే ఉత్తమం. అలాగే ప్రతి రోజు వీలైనంత మేరకు నడక సాగించండి.  
* ముఖ్యంగా ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఒత్తిడి కారణంగా కొందరు విపరీతంగా తినేస్తుంటారు. దీంతో బరువు పెరిగిపోవడం ఖాయం.
* ఒత్తిడి దరిచేరనీయకుండా మితంగా ఆహారం సేవిస్తుంటే శరీర బరువును అదుపులో పెట్టుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : weight loss tips  healthy home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more