Best Healthy Food Items To Stay Health And Fit | Home Remedies

Best healthy food items and habbits to stay health and fit

health tips, healthy habbits, healthy remedies, health homemade tips, dark chocolate benefits, healthy fruits, healthy drinks, protien foods, vitamins food items

Best Healthy Food Items And Habbits To Stay Health And Fit : Experts Giving Some Best Healthy Food Items And Habbits To Stay Health And Fit.

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపు అలవాట్లు

Posted: 08/24/2015 03:25 PM IST
Best healthy food items and habbits to stay health and fit

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతిఒక్కరు పాస్ట్ ఫుడ్, బర్గర్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటుంటారు. ఆఫీసు పనులు, ఇతర కార్యకలాపాల కారణంగా ఇంట్లో ఆరోగ్యకరమైన భోజనం తయారుచేసుకునే సమయం లభించక.. అటువంటి ఆహారాలకు అలవాటు పడతారు. కానీ.. వాటిని తరుచూ తీసుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, కొలెస్టిరాల్ పెరిగిపోవడంతోపాటు హార్ట్ ఎటాక్ వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి.. వాటికి బదులుగా కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నిత్యం పాటిస్తే చాలు.. ఎంతో శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. మరి.. అవేమిటో తెలుసుకుందామా..

* సాధారణంగానే బేకరీల్లో తయారు చేసే పదార్థాలు నోరూరిస్తాయి. కానీ వాటివల్ల కొవ్వు పెరుగుతుంది. అలాంటప్పుడు ఇతర తీపి పదార్థాలను కాకుండా.. నాణ్యమైన డార్క్ చాక్లెట్ ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే.. అందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. అవి శరీరానికెంతో మేలు చేస్తాయి.

* నచ్చిన పండ్లూ, కూరగాయలూ ఎంచుకోవడం సరే. వాటితోపాటు రకరకాల రంగుల్లో ఉన్నవాటికీ ప్రాధాన్యం ఇవ్వాలి. అవి కూడా ఆయా కాలాలకు తగిన విధంగా ఎంచుకుంటే మంచిది. అదే సమయంలో ఇంట్లో జీడిపప్పూ, బాదం, గుమ్మడీ, పొద్దుతిరుగుడు గింజలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. వాటివల్ల శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లూ, ఒమెగా త్రి ఫ్యాటీ ఆమ్లాలూ అందుతాయి. ఇంకో విషయం ఏమిటంటే.. వాటిని నేరుగా తినడం కంటే, సలాడ్లపై వేసుకుంటే మరీ మంచిది.

* శీతలపానీయాలు, రకరకాల జ్యూస్‌లు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరికీ ఇష్టమే. అయితే వాటిని రెగ్యులర్ గా తాగితే మాత్రం బరువు పెరుగుతారు. ఇతర అనారోగ్యాలూ ఎదురవుతాయి. మరి.. అలాంటప్పుడు ఎలా..? అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైనా జ్యూస్ తాగాలనుకుంటే పండ్ల రసాలను ఇంట్లోనే చేసుకోవాలి. అందులో నిమ్మరసం చేసుకుని తాగతే ఇంకా మంచిది. ఇంట్లో పండ్ల రసాలు చేసుకుంటున్నప్పుడు చక్కెర తక్కువ వేసుకుంటే మంచిదని అంటున్నారు.

* బ్రెడ్, నూడుల్స్ లాంటివి తినడానికి బాగానే ఉంటాయి కానీ వాటికన్నా పొట్టుతీయని గింజలతో చేసిన బ్రెడ్, పాస్తా, ఓట్స్, దంపుడు బియ్యం లాంటివి ఎంచుకోవాలి. వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇతర పోషకాలూ అందుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : healthy habbits  home remedies  healthy food items  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more