The Healthy Home Remedies For Throat Problems | Cough Tips | Healthy Foods | Cool Problems

Healthy home remedies for throat problems cough tips healthy foods

throat problems, throat health tips, health tips, health remedies, throat remedies, throat tips, cough syrups, cough remedies

Healthy Home Remedies For Throat Problems Cough Tips Healthy Foods : The Experts Giving Some Healthy Home Remedies To Get Rid Of Throat Problems

గొంతు సమస్యలకు చెక్ పెట్టే ఇంటి చిట్కాలు

Posted: 08/22/2015 11:07 AM IST
Healthy home remedies for throat problems cough tips healthy foods

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు నిత్యం వస్తుంటాయి. ముఖ్యంగా చిరుజబ్బులు నీడలా వెంటాడుతూనే వుంటాయి. దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు, గొంతులో మంట, గొంతు గరగరలు.. ఇలా రకరకాల వ్యాధులు వేధిస్తుంటాయి. ఈ విధమైన సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే.. కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

గొంతు సమస్యలకు చెక్ పెట్టే రెమెడీల్లో ‘వేడి వేడి సూప్’ ఎంతో శ్రేయస్కరమైంది. మాంసాహారులైతే చికెన్ సూప్ లేదంటే మెంతులూ, పెసలూ కలిపి చేసిన సూప్‌లు ట్రై చేయవచ్చు. చిక్కగా, వేడిగా ఉండే సూప్‌ల వల్ల గొంతులో గరగర మటుమాయమవుతుంది. గొంతు సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు క్యారెట్‌ని తురిమి బాగా ఉడికించి, ఆ గుజ్జును వేడిగా తినాలి. ఈ విధంగా తీసుకోవడం వలన గొంతుకు సాంత్వన లభిస్తుంది. అదేవిధంగా క్యారెట్‌లో ఉన్న పీచు పదార్థాలు, పొటాషియం, సి, కె విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఇన్‌ఫెక్షలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి.. క్యారెట్ సూప్ తీసుకోవడాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఎంతో మంచిది.

ఒకవేళ గొంతులో నొప్పి, మంట ఎక్కువగా వుంటే.. అప్పుడు ఓట్స్ నీళ్లలో ఉడికించి, వేడి వేడిగా తీసుకోవాలి. తద్వారా ఆకలి తీరడంతోపాటు అందులో ఉన్న పీచూ, ఫొలేట్లూ, పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలూ శరీరానికి అందుతాయి. ఓట్స్ మాత్రమే ఉడికించి తినలేని వాళ్లు అందులో అరటి పండు గుజ్జూ, తేనె వంటివి కలిపి కూడా తీసుకోవచ్చు. వేడి వేడి గ్రీన్ టీలో తేనె కలిపి తీసుకుంటే గొంతుకు చాలా మంచిది. తేనెలోని పోషకాలు గొంతులో చేరిన ఇన్ ఫెక్షన్లతో పోరాడతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ చిట్కాలు రెగ్యులర్ గా పాటిస్తే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : throat problems  health tips  home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more