The Health Benefits Of Black Jamun | Neredu Pallu Benefits | Healthy Food Items

Black jamun health benefits home remedies healthy food items

black jamun, black jamun benefits, black jamun photos, black jamun images, black jamun health tips, black jamun health remedies, black jamun remedies, black jamun fruits, black jamun, Apricot health benefits

Black Jamun Health Benefits Home Remedies Healthy Food Items : The Health Benefits Of Black Jamun. It Contains Number Of Nutrients Which Helps To Get Rid Of Different Problems.

సకలరోగాలను నివారించే నేరేడు పండు

Posted: 08/25/2015 11:48 AM IST
Black jamun health benefits home remedies healthy food items

ప్రస్తుత ఆధునిక యుగంలో వాతావరణ కాలుష్యం తీవ్రంగా పెరిగిపోవడమే కాకుండా.. పోషకాహారాలోపం కారణంగా ప్రతిఒక్కరు రకరకాల రోగాల బారిన పడుతున్నారు. చిన్నపిల్లలు సైతం బీపీ, షుగర్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఇంతేకాదు.. ఇంకా చిరుజబ్బులు నిత్యం వేధిస్తూనే వుంటాయి. వీటన్ని నుంచి తక్షణమే ఉపశమనం పొంది, ఆరోగ్యంగా వుండాలంటే ప్రత్యేకమైన మందులు వాడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఆ మందులకు బదులుగా ఆయా కాలాల్లో ప్రకృతి సహజంగా లభించే పళ్ల ద్వారానే నయం చేయవచ్చునని చెబుతున్నారు. అలాంటి పళ్లలో నేరేడుపళ్లు ఎంతో ముఖ్యమైనవి.

అవును.. నేరేడు పళ్లు కేవలం రుచికరంగా వుండటమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎందుకంటే.. ఇందులో రకరకాల వ్యాధులకు సంబంధించి వివిధ పోషకాలు పుష్కలంగా వున్నాయి. ముఖ్యంగా నేరేడు పళ్లు మధుమేహ వ్యాధి నివారణకు బాగా ఉపకరిస్తాయి. ఇందులో గ్లైకమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ వ్యాధికి చక్కగా పనిచేస్తాయి. యాంటీ డయాబెటిక్ ఎఫెక్ట్స్ ఉండే మంచి పండు నేరేడు అని పలు అధ్యయనాల్లో తేలింది కూడా. అంతేకాదు.. ఐరన్, కార్షియం, పొటాషియం, విటమిన్ సి తదితర పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పళ్లు తింటే.. వ్యాధి నిరోధక శక్తితోపాటు ఎముకలకు గట్టిదనం కూడా వస్తుంది. చిన్న పిల్లల్లో కనిపించే ఎనీమియా వ్యాధికి మంచి ఔషధం నేరేడు. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి. నేరేడు పళ్లు తీసుకుంటే డయేరియా వ్యాధి తగ్గుముఖ పండుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేరేడు పళ్లు క్యాన్సర్ రాకుండా చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి.

నేరేడు పళ్లు మాత్రమే కాదు, నేరేడు చెట్టు ఆకులు, బెరడు, విత్తనాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్స్ని తరిమికొట్టడానికి ఉపయోగపడతాయి. నేరేడు చెట్టు ఆకులు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇన్ని ఔషధగుణాలు కలిగిన ఈ నేరెడు పండును రెగ్యులర్ గా తీసుకుంటే.. నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : black jamun benefits  healthy fruits  health tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more