నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే పోషకాలతో నిండిన ఆహారాల్ని రెగ్యులర్ గా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఆ పోషకాల్లో చాలా ముఖ్యమైనవి విటమిన్లు. విటమిన్లు అవయవాలను ఉత్తేజంగా వుంచడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. కాబట్టి.. విటమిన్లు కలిగిన ఆహారాల్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఎంతో శ్రేయస్కరం. ఎంతో ముఖ్యమైన ఈ విటమిన్లు ఏయే ఆహారాల్లో లభిస్తాయో తెలుసుకుందామా..
* విటమిన్ ఎ- పాలు, కోడిగుడ్డు, కేరట్, చేపలు, బొప్పాయి,
* విటమిన్ బి1 - ఈస్ట్, తృణధాన్యాలు
* విటమిన్ బి2- గోధుమలు, కోడిగుడ్డులు, పాలు, ఈస్ట్
* విటమిన్ బి6 - ఈస్ట్, మాంసం, రోటీలు, బఠాణీలు.
* విటమిన్ బి12 - ఈస్ట్, పాలు, కోడిగుడ్డు
* విటమిన్ సి - పులుపు నిచ్చే పండ్లు, నిమ్మ, ఆరెంజ్, క్యారెట్, చేపలు, నూనె
* విటమిన్ డి - సూర్య కాంతి, వెన్న
* విటమిన్ ఈ - గోధుమలు, ఆకుకూరలు, పాలు
* విటమిన్ కె - క్యాబేజీ, పచ్చి బఠాణీలు, కూరగాయలు
* ఐరన్ - ఆకుకూరలు, క్యాలీఫ్లవర్, బీన్స్, కాకరకాయ, దానిమ్మ, సపోటా, పుచ్చకాయ, అనాస పండ్లలో, ఎండు ద్రాక్ష, ఖర్జూరం
పైన పేర్కొనబడిన ఆహారాల్లో వివిధ రకాల విటమిన్లు మోతాదుకి మించే పుష్కలంగా వుంటాయి. ఈ ఆహారాల్ని రెగ్యులర్ డైట్ లో తప్పనిసరగా చేర్చుకోవాల్సిందేనని, అప్పుడు ఏ వ్యాధులు దరిచేరవని న్యూట్రిషన్స్ అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more