ప్రస్తుతకాలంలో మహిళలు కూడా మగవారితో సమానంగా మెలుగుతున్నారు. వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో మగవారికంటే ముందుగానే మహిళలు దూసుకుపోతున్నారు. పరాయి మగాళ్ల మీద ఆధారపడకుండా తమకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకుంటున్నారు.
గర్భంతో వున్న స్త్రీలు ముఖ్యంగా డాక్టర్లు ఇచ్చిన మందులనే నిత్యం వాడుతూనే వుండాలి. అలాగే సమయానుకూలంగా యోగా చేయడం, పోషకాలు అందించే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. దీంతో పిండం ఆరోగ్యవంతంగా పెరగుతుంది. నిర్దేశించిన సమయాల్లో చికిత్సలు చేసుకోవడం ఎంతో ఉత్తమం.
అయితే నేటి సమాజంలో నూటికి తొంభైమంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి పని ఒత్తిడికి లోనయి రకరకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. గర్భిణీలు అయినప్పటికీ ఆఫీసు కార్యాలయానికి వెళ్లాల్సి వుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో చుట్టూ వున్న వాతావరణ పరిస్థితుల వల్ల వారు అనారోగ్యం అవ్వడమే కాకుండా పిండం కుండా దెబ్బతినే అవకాశం వుంది.
కాబట్టి ఉద్యోగస్తులైన గర్భిణీ స్త్రీలను దృష్టిలో వుంచుకుని వారికి నిపుణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచనలు ఇస్తున్నారు.
గర్భిణీ స్త్రీలు ఉద్యోగస్తులైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
1. ఆఫీసులో పని ఎక్కువగా వుండటం వల్ల ఎక్కువ సమయం అక్కడే వుండాల్సి వుంటుంది. అయితే ఉద్యోగస్తులైన గర్భిణీలు స్త్రీలు అటువంటి సమయాల్లో తొందరగా పనిని ముగించుకుని ముందుగానే వెళ్లిపోతే చాలా మంచిది. అలా కాకుండా ఆలస్యం చేస్తే దాంతో టెన్షన్ మొదలవుతుంది. దీంతో బీపీ, రక్తంలో కొలెస్టిరాల్ శాతం అధికం అవుతుంది. ఫలితంగా అది వారి ప్రాణానికి హానికరం అవుతుంది.
2. ఆఫీసు పని ఒత్తిడిని అధిగమించేందుకు గర్భంతో వున్న మహిళలు నిత్యం టీ, కాఫీలు వంటివి కాస్త ఎక్కువగానే తాగుతుంటారు. అయితే అందులో వుండే హానికర పదార్థాలు గర్భస్త శిశువులకు హానికలిగిస్తాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు వాటిని తీసుకోకుండా వుంటే మంచిది. అదేవిధంగా బాగా మరగబెట్టి చల్చార్చిన పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
3. గర్భంతో వున్న మహిళలు ఎక్కడబడితే అక్కడ నీళ్లు తాగుతుంటారు. ముఖ్యంగా ప్యాకెట్లలో విక్రయించే వాటిని వినియోగించడం శ్రేయస్కరం కాదు. మరగబెట్టిన నీటిని చల్లార్చుకుని బాటిల్ లో వేసుకుని ఆఫీసుకుని తీసుకెళ్తే మంచిది.
4. గర్భంతో వున్న మహిళలు ఆఫీసుకు ఆటోలోగాని, బస్సుల్లోగాని వెళతారు. అయితే ట్రాఫిక్ శబ్దాల వల్ల వారికి, గర్భస్థ శిశువులకు అవి చేటు చేస్తాయని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇటీవలె నిర్వహించిన పరిశోధనల్లో... పెద్దవారు వినలేని అల్ట్రాసౌండ్ తరంగాలకు గర్భంలో వున్న శిశువు చక్కగా స్పందించగలుగుతుందని, అయితే అవి వారికి చేటుని కలిగిస్తాయని నిరూపితమైంది. కాబట్టి భీకర శబ్దాలు ఎక్కువగా వున్న చోట్లలో గర్భిణీ స్త్రీలు వుండకూడదు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more