ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే సమయం వరకు మానవులు నిత్యం తమ కార్యక్రమాలలో మునిగిపోతుంటారు. బయట వుండే వాతావరణ పరిస్థితుల వల్ల, శబ్దకాలుష్యం వల్ల, ఎక్కువగా వేడి వుండటం వల్ల తలనొప్పి ఎక్కువవుతుంది. అలాగే మనం చేసే కార్యక్రమాలలో చేతులు, కాళ్లు, తల, మెడ, కళ్లు ఇలా అనేక ఇతర శరీరా భాగాలు నిత్యం పనుల్లోనే మునిగివుంటాయి కాబట్టి అవి కూడా నొప్పిని కలిగిస్తాయి.
ఇటువంటి బాధల నుంచి విముక్తి పొందడానికి చాలా మంది మసాజ్ సెంటర్లకు, పార్లర్లకు వెళుతుంటారు. దానికి ఎక్కువ ఖర్చు కూడా వెచ్చించాల్సి వస్తుంది. కొన్ని మసాజ్ సెంటర్లవారు అయితే మరీ ఘోరంగా ఎక్కువ ఫీజులను కేటాయిస్తుంటారు.
అలా కాకుండా మీరు మీ ఇంట్లోనే వారానికి ఒకసారి ఈ బాడీ మసాజ్ ను చేసుకుంటే... తక్కువ ఖర్చు అవ్వడమే కాకుండా ఆరోగ్యంగా వుంటారు. దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ ని కూడా వైద్యులు మనకు అందిస్తున్నారు.
బాడీ మసాజ్ చేసుకునే విధానం... వాటి ప్రయోజనాలు...
1. తలకు మసాజ్... తలనొప్పి ఎక్కువగా వున్నప్పుడు.. కొంచెం కొబ్బరి నూనెను తీసుకుని మృదువుగా తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు చేసుకుంటే తలకు రిలాక్స్ గా వుండడమే కాకుడా.. రోజంతా పనిచేసే మన మెదడుకు కూడా బాగా విశ్రాంతి లభిస్తుంది. దీంతో రాత్రి హాయిగా నిద్రపోవచ్చు.
2. ముఖానికి మసాజ్... మన చుట్టూ వుండే వాతావరణ పరిస్థితులలో మార్పు రావడం వల్లగాని, వేడి ఎక్కువ అయినప్పుడు గాని మన ముఖం ముడతలుగా మారడం జరుగుతుంది. అలాగే కంటికింద నల్లని ఛారలు కూడా ఏర్పడి.. ముసలివారిగా మారిపోతున్నట్లు కనిపిస్తారు. అటువంటి సమయాల్లో నూనెతో మసాజ్ చేసుకోవాలి. దీనినే ఫేషియల్ అని కూడా అంటారు. ఈ మసాజ్ చేస్తున్నప్పుడు చెవులు, ముక్కుకు కూడా మర్దన చేయాలి. అయితే మసాజ్ చేసేటప్పుడు చేతివేళ్ల గోర్లు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారి.. అందంగా కనిపిస్తారు.
3. మెడకు మసాజ్... చాలామంది మెడనొప్పితో బాధపడుతుంటారు. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారివరకు ప్రతిఒక్కరిని బాధిస్తుంది. కాబట్టి మెడకు మసాజ్ చేసేటప్పుడు మొదటగా.. మెడ భాగాన్ని మెల్లగా అటూ, ఇటూగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి. అలాగే రెండు చేతులను పైకి, కిందకు ఎత్తుతూ, దించుతూ మసాజ్ చేస్తే చాలా రిలీఫ్ గా వుంటుంది. ఇలా చేయడంతో మెదడు కూడా విశ్రాంతిగా వుంటుంది. పైగా శరీరం వదులుగా వున్నట్టు అనిపిస్తుంది.
4. చేతులకు మసాజ్... మనం నిత్యం చేసే కార్యకలాపాలలో చేతులు ప్రముఖపాత్రను పోషిస్తాయి. దీంతో మోచేతులు, అరచేతులు కొంచెం నొప్పిగా, బాధగా అనిపిస్తాయి. అటువంటి సమయాల్లో ఒక చేత్తో ఇంకొక చేతిని మసాజ్ చేయాలి. చేతివేళ్ల మధ్య, మెల్లగా వొత్తుతూ మసాజ్ చేయడం వల్ల జాయింట్లు రిలీఫ్ అవుతాయి. ఇలా చేయడం వల్ల చేతులు బాగా వదులుగా అవుతాయి.
5. కాళ్లకు మసాజ్... కాళ్లు మానవుని శరీరంలో నిత్యం శ్రమించే అవయవాలు. మనం ఉదయం లేచిన సమయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా తిరుగుతూనే వుంటాం కాబట్టి కాళ్లు చాలా నొప్పిగా వుంటాయి. అటువంటి కాళ్లకు విశ్రాంతి కావాలంటే మసాజ్ చేయడం తప్పనిసరి. మొదటగా రెండు కాళ్లను చాచి.. మోకాలి భాగం నుంచి అరికాలి వరకు బాగా మర్దన చేయాలి. కాళ్లకు మృదువుగా మాలిష్ చేసుకోవాలి. ఆయుర్వేద తైలాలు లేదా కొబ్బరి నూనెతో ఇలా మాలిష్ చేసుకోవడం వల్ల కాళ్ల నొప్పులు తగ్గి.. హాయిగా నిద్రపోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more