పురాణ కథ :
పూర్వం ఒకనాడు దైత్యరాజు అయిన బలి చక్రవర్తికి, స్వర్గాధిపతి అయిన ఇంద్రునికి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. అయితే ఆ యుద్ధంలో బలిచక్రవర్తి పరాజయం పొందుతారు. దాంతో ఆ చక్రవర్తి ఇంద్రుడిని ఎలాగైనా ఓడించాలనే నెపంతో తన గురువైన శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్లి సలహా కోరాడు.
అలా గురు శరణు (సలహా) తీసుకున్న కొంతకాలం తరువాత బలిచక్రవర్తి తిరిగి మళ్లీ ఇంద్రునితో యుద్ధం చేస్తాడు. అయితే ఈసారి ఇంద్రుడు ఓటమి పాలవగా.. బలిచక్రవర్తి స్వర్గంపై అధికారాన్ని సంపాదించుకుంటాడు.
అధికారం పోయిందన్న నెపంతో ఇంద్రుడు తీవ్రంగా బాధపడ్డాడు. తన అధికారాన్ని తిరిగి పొందడం కోసం అదితి దేవిని శరణు కోరుకున్నాడు. ఇంద్రుని పరిస్థిని అర్థంచేసుకున్న అదితిదేవి.. ఎంతో దు:ఖిస్తుంది. తనకోసం పయోవ్రతాన్ని కూడా అనుష్టానం చేస్తుంది.
అలా వ్రతాన్ని అనుసరించిన తరువాత.. వ్రతం చివరిరోజు భగవానుడు ప్రత్యక్షమై అదితిదేవితో... ‘‘దేవీ! చింతించకు. నేను నీకు పుత్రునిగా జన్మిస్తాను. ఇంద్రునికి చిన్నతమ్మునిగా వుంటూ.. అతనికి శుభం కలిగిస్తాను’’ అని చెప్పి వెంటనే అదృశ్యమవుతాడు.
ఇలా కొన్నాళ్ల తరువాత అదితిగర్భంలో శ్రీమహావిష్ణువు వామన రూపంలో జన్మించాడు. స్వయం భగవానుడే తనకు పుత్రునిగా జన్మించాడని అదితి దేవి ఎంతగానో ఆనందించింది. మహర్షులు, దేవతలు కూడా చాలా సంతోషించారు. వామనమూర్తికి ఉపనయన సంస్కరాలు గావించారు.
ఒకసారి బలిచక్రవర్తి భృగుకచ్ఛం అనే చోట అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాడని విని.. వామభగవానుడు తక్షణమే అక్కడకు చేరుకుంటాడు. దివ్య యశస్సులతో, బ్రహ్మ తేజస్సుతో వెలుగుతున్న వామనుడు.. దండాన్ని, గొడుగును, కమండలాల్ని ధరించి, బ్రాహ్మన రూపంలో యజ్ఞమండపంలోకి ప్రవేశించాడు.
ఇటువంటి తేజస్సుతో, బ్రాహ్మణ రూపంలో వున్న వామనుడిని చూసి.. బలి చక్రవర్తి ఒక్కసారిగా భయపడిపోతాడు. ఆయనను ఉత్తమ ఆసనంపై కూర్చోపెట్టి పూజిస్తాడు. తరువాత బలిచక్రవర్తి వామనుడిని ఏదైనా కోరుకోమని చెప్పాడు. అప్పుడు వామనుడు.. ‘‘మూడు పాదాల భూమి’’ని అడిగాడు.
అక్కడే వున్న శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానం చేయవద్దని ఎంత బ్రతిమిలాడిన, బలిచక్రవర్తి మాత్రం గురువు మాట వినలేదు. పైగా దానం చేయడానికి సంకల్పం చేసేందుకు జలపాత్రను కూడా ఎత్తాడు. ఆ సమయంలో శుక్రాచార్యుడు శిష్యునిని మేలుచేయాలనే నెపంతో.. ఆ జలపాత్రలో ప్రవేశించి, జలం వచ్చే దారిని మూసేశాడు.
దీనిని గమనించిన వామభగవానుడు.. ఒక దర్భను తీసుకుని ఆ పాత్రలో నీరు వచ్చేవిధంగా దారిని ఛేదించాడు. దీంతో శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది. సంకల్పం పూర్తి అయిన వెంటనే వామనుడు అడిగిన విధంగా మూడు పాదాలలో... ఒక పాదాన్ని పృథ్విపై, రెండవ పాదంతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఇక మూడవ పాదానికి బలి తనకు తానే సమర్పించుకున్నాడు.
బలి చక్రవర్తి ఇలా తనకు తానే లొంగిపోవడంతో భగవానుడు ఎంతో ప్రసన్నుడే.. బలికి సుతలోక రాజ్యాన్ని ఇచ్చేశాడు. ఇంద్రునికి ఇంద్ర పదవిని అప్పగించి, తన స్వర్గాన్ని తిరిగిచ్చేశాడు. ఇలా ఈ విధంగా వామనుని వృత్తాంతం గురించి పురాణాలలో కథనాలు చెబుతున్నాయి.
మరొక పురాణ కథ :
వామన పురాణంలో వామనుని జన్మవృత్తాంతం గురించి ఇంకొక కథ కూడా విశదీకరించబడి వుంది.
పూర్వం దుంధుడు అనే రాక్షసుడు దేవతలపై దండెత్తి, మొత్తం బలాన్ని తాను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేయసాగాలు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే దేవికా నదీ తీరంలో అశ్వమేధ యాగం చేయసాగాడు.
దుంధుడిని యుక్తితో జయించాలనే నెపంతో శ్రీమహావిష్ణువు వామన రూపంలో అవతారమెత్తి.. దేవికా నదిలో ఒక దుంగలాగా తేలుతూ.. కొట్టుకుపోసాగాడు. దీనిని గమనించిన దుంధుడు, అతని అనుచరులు.. ఆ బాలుణ్ణి రక్షించి బయటకు తీసుకువచ్చారు.
అప్పుడు వామనుడు ఇలా అంటాడు.. ‘‘నా పేరు గతి భానుడు. నేను మరుగుజ్జు అయినందువల్ల ఆస్తి వివాదాల్లో నా బంధువులు, దాయాదులు ఇలా నదిలో పడేసి వెళ్లిపోయారు’’ అని చెబుతాడు.
అతని దీన పరిస్థితిని, గాధను విన్న దుంధుడు, ఏం కావాలో కోరుకోమన్నాడు. దాంతో వామనుడు ఆ ప్రదేశంలోనే దుంధున్ణి భూమిలోకి తొక్కి సమాధి చేశాడని ఇంకో పురాణగాధ.
మరికొన్ని విశేషాలు :
వ్యాసుడు రచించిన పద్దెనిమిది (18) పురాణాలలో వామన పురాణం కూడా ఒకటి. శ్రీమహావిష్ణువు, వామన అవతారమెత్తి, బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపిన కథపై ఇది ఆధారపడి వుంది.
ధర్మానికి భంగం కలిగిన ప్రతీసారి ఏదో ఒక అవతారం ఎత్తి ధర్మ సంస్థాపన చేస్తానని శ్రీ కృష్ణుడు గీతలో ప్రబోధించాడు. ఈ అవతారాలలోనే వామన అవతారం కూడా ఒకటి.
ఎంతో మహిమాన్వితమైన వామనుడు పుట్టినరోజున.. శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ప్రార్థించి, పూజలు చేస్తే వారికి అష్టఐశ్వర్యాలు పొందుతాయని పురోహితులు చెబుతున్నారు. అలాగే వైష్ణవ దేవాలయాలను సందర్శించుకునేవారికి సిరిసంపదలతోపాటు పుణ్యఫలం కూడా లభిస్తుందని పండితులు సలహాలు ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more