చదువుల తల్లి అయిన సరస్వతీదేవి జన్మదిన సందర్భంగా మాఘశుద్ధ పంచమినాడు ‘‘వసంత పంచమి’’ పండుగను నిర్వహించుకుంటారు. ఈ పర్వదినాన్ని ‘‘శ్రీ పంచమి’’ అనే పేరుతో కూడా పిలుచుకుంటారు. ఏవిధంగా అయితే దుర్గాదేవిని నవరాత్రులవరకు పుస్కరించుకుని, పూజించుకుంటారో... అదేవిధంగా ప్రతిఒక్కరు వసంత పంచమినాడు సరస్వతీదేవిని ఎంతో భక్తిశ్రద్ధలతో అర్చిస్తారు.
ముఖ్యంగా విద్యార్థులకు ఈ పండుగ అంటే ఎంతో మక్కువ. చిన్నారులకు ఈ పర్వదినం రోజు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది. భవిష్యత్తులో వారు ఉన్నత విద్యలను పొందుతారు. సాధారణంగా చెప్పుకోవాలంటే.. కాలేజీల్లో కూడా సరస్వతీ దేవికి ఈ పర్వదినంనాడు ప్రత్యేక పూజలను నిర్వహించుకుంటారు.
ఎంతో శుభదినమైన ఈ వసంత పంచమినాడు చాలామంది పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. మరికొంతమంది సూర్యభగవానుడికి, గంగానదికి ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహిస్తారు.
సరస్వతీ దేవీలో వున్న విశిష్టతలు :
సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని అర్థాంగి సరస్వతీ. సరస్వతీ దేవీకి వున్న నాలుగు చేతులు, నాలుగు దిక్కులకు సంకేతంగా వుంటాయి. సరస్వతీ తన నాలుగు చేతులలో నాలుగు రకాల వస్తువులను పట్టుకుని వుంటుంది. ఆ నాలుగు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వభావాన్ని కలిగి వుంటాయి.
1. పుస్తకం : విజ్ఞానానికి సర్వస్వం లాంటి వేదాలు ;
2. జపమాల : అక్షరజ్ఞానంతపాటు శ్రద్ధాశక్తులను పెంచుతుంది.
3. వీణ : ఇది కళలకు సంకేతం. అతీంద్రియ శక్తులను అందించి మోక్షం కలిగించడానికి దోహదపడుతుంది.
4. కమలం : ఇది సృష్టికి సంకేతం.
అలాగే సరస్వతీదేవి ధరించివున్న తెల్లని చీర స్వచ్ఛతకు, ప్రశాంతతకు నిదర్శనంగా వుంటుంది. సరస్వతీదేవి పుట్టింది కూడా చలికాలంలోనే కాబట్టి.. ఆమె చల్లదనం కారుణ్యానికి కూడా సంకేతంగా వుంటుంది.
పూజావిధానం :
వసంత పంచమిరోజు భక్తులు సరస్వతీ దేవిని పసుపుచీరతో అలంకరిస్తారు. తాము కూడా పసుపు వస్త్రాలను ధరించి, సరస్వతీ దేవికి పూజలను నిర్వహించుకుంటారు. మిఠాయిలు దేవీకి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా అందరికీ పంచిపెడతారు. సరస్వతీదేవిని పూజించే సమయంలో ఈ క్రింది స్తోత్రాన్ని పఠించాలి.
ఓం సరస్వతీ మహాభాగ్యే విద్యే కమలలోచనే
విశ్వరూపే విశాలాక్షీ, విద్యాం దేహి నమోస్తుతే
జయజయ దేవి చరాచరశరీ కుచయుగ శోభిత ముక్తహారే
వినా రంజిత పుస్తక హస్తే భగవతి భారతి దేవి నమోస్తుతే
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more