దౌందార్ జలపాతాలు
ఉత్తర భారతంలో ఇవి ప్రసిద్ధి చెందినవి. సుమారు 10 మీటర్ల ఎత్తునుంచి పుట్టే ఈ జలపాతాలు.. నర్మదా నదీ నీటి ప్రవాహం కారణంగా ఏర్పడ్డాయి. చక్కని రాళ్లగుండా ప్రవహించి పెద్ద శబ్దంతో అతివేగంగా ప్రవహించే ఇవి.. అక్కడ పొగమంచును పుట్టిస్తాయి. ‘‘దౌ’’ అంటే పొగ.. అందుకే దీనిని దౌందార్ అనే పేరు వచ్చింది.