చిత్రకూట్ జలపాతాలు
వీటిని భారత దేశ నయాగరా జలపాతాలు అని పేర్కొంటారు. ఇండియాలోనే ఇవి అతి వెడల్పైన జలపాతాలు. ఇవి జగదల్ పూర్ కు సుమారు 38 కి. మీ. ల దూరంలో కలవు. చత్తీస్ ఘర్ లో ని జలపాతాలలో ఇవి అత్యంత ప్రసిద్ధి చెందిన జలపాతాలు గా పేర్కొంటారు. చుట్టూ దట్టమైన అడవుల మధ్య అద్భుతంగా వుంటాయి. సుమారు 95 అడుగుల ఎత్తు నుండి పడే ఈ జలపాతాలు చూసేందుకు వేలాది పర్యాటకులు వస్తారు.