వెల్లుల్లి
వెల్లుల్లిలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. వీటిని నిత్యం ఆహారపదార్థాల్లో తీసుకుంటే ఎన్నో రోగాలు మన దగ్గరికి రావు. వెల్లుల్లిలో ఉండే ఆంటిసెప్టిక్.. ఆంటి బ్యాక్టీరియల్, ఆంటీ వైరల్స్, స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉంచుతాయి. బ్లడ్ ప్రెషర్ ను క్రమబద్ధంగా వుంచి గుండెను ఆరోగ్యంగా వుంచుతాయి. శరీరంలో వుండే చెడు కొవ్వు పదార్థాలను నిర్మూలించడంలో ఇవి ప్రధానపాత్రను పోషిస్తాయి.