The mother of the son of the property can be registered

property law, legal advice,

The mother of the son of the property can be registered?.

తల్లి ఆస్తిని కొడుకు రిజిస్టర్ చేయించవచ్చా ?

Posted: 06/19/2014 08:29 PM IST
The mother of the son of the property can be registered

మేము రెండేళ్ల క్రితం మంగళగిరిలో 50 గజాల స్థలాన్ని అందులో ఉన్న ఇంటితో సహా రూ. 4, 75, 000 లకు కొనుగోలు చే శాం. ఆ ఇంటిని స్వాధీనం చేసుకుని ప్రసుతం ఆ ఇంట్లోనే ఉంటున్నాం. ఆ ఇంటికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు రిజిస్టర్ ఒరిజినల్ దస్తావేజు, పన్నుకాగితాలు, మా దగ్గరే ఉన్నాయి. మాకు ఆ ఇల్లు అమ్మిన ఆవిడకు 75 ఏళ్లు. ప్రస్తుతం ఆమె చాలా అరోగ్యం విషమంగా ఉంది. మేము కొన్న భూమిని వెంటనే రిజిస్టర్ చేయించుకోవడానికి ప్రస్తుతం మా వద్ద డబ్బులు లేవు. నిజానికి ఆ ఇల్లు కొనుగోలు చేసిన తాలూకు అప్పులు తీరడానికే ఇంకో ఆరు మాసాలు పడుతుంది. ఆమె ఆరోగ్యమేమో నానాటికీ క్షీణిస్తూ వెళుతోంది. అయితే ఈ కొనుగోలు వ్యవహారమంతా ఆమె పెద్ద కొడుకుతోనే జరిగింది. "మీ అమ్మగారి పరిస్థితి చావు బతుకుల మధ్య ఉంది కదా!'' అని అతనితో అంటే అతనేమో, మీకేమీ ఫరవా లేదు ఒకవేళ ఆమె చనిపోయినా నేను రిజిస్టర్ చేస్తానంటూ, తల్లి అతని పేరుతో రాసిన రిజిస్టర్ వీలునామా చూపించాడు. అంతే కాకుండా, అతడు 4, 75, 000 తీసుకున్నట్లు రసీదు ఇవ్వమంటే, రెవెన్యూ స్టాంప్ మీద సంతకం చేసి ఇచ్చాడు. ఒకవేళ నిజంగానే ఆమె చనిపోతే ఆమె కొడుకు రాసి ఇచ్చిన దస్తావేజులు చెల్లుబాటు అవుతాయా? ఇంటికి సంబంధించిన ఒరిజినల్ రస్తావేజులు, లింక్ డాక్యుమెంట్లు పన్ను రసీదులు, వీలునామా మా వద్దనే ఉన్నాయి. ఆ ఇంట్లో మేము ఉన్నప్పటికీ ఆమె చావు బతుకుల మద్య ఉండడం మాకు ఆందోళన కలిగిస్తోంది. ఈ స్థితిలో మాకు న్యాయపరమైన సలహా ఇవ్వండి.


కొనుగోలు చేసిన భూమికి మొత్తం డబ్బు మీరు చెల్లించినప్పటికీ మీకు సేల్ -డీడ్ దస్తావేజు రిజిస్టర్ చేయనట్లయితే, ఆ ఇంటి మీద మీకు సంపూర్ణ యాజమాన్యపు హక్కులు సంక్రమించవు. మీరు మొత్తం డబ్బు చెల్లించి అగ్రిమెంటు చేయించుకుని, అందులోనే మీరు నివసిస్తున్నప్పుడు, మీకు కొన్ని వెసులు బాట్లు ఉన్నప్పటికీ అవన్నీ రిజిస్టర్ దస్తావేజు మీద జరగాలని చట్టం చెబుతుంది. అలా రిజిస్టర్ దస్తావేజు ద్వారా జరపనట్లయితే, మీకు ఆ ఆస్తి పై సంపూర్ణ యాజమాన్యపు హక్కులు సంక్రమించవు. అయితే మీరున్న ఇంటిని మీకు అమ్మిన వ్యక్తి ప్రసుతం చావుబతుకుల మధ్య ఉన్నారని, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కోసం మీ వద్ద డబ్బు లేనందువల్ల మీరు రిజిస్ట్రేషన్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలియచేశారు. ఆమె ఈ కొనుగోలు వ్యవహారాన్నంతా తన కొడుకు ద్వారానే జరిపించినందువల్ల అతని నుంచి కూడా మీరు డబ్బు మొత్తం ముట్టినట్లుగా రసీదు పొందినట్లు కూడా రాశారు. మీకు అమ్మిన వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నందువల్ల రిజిస్ట్రేషన్‌కు మీ వద్ద డబ్బు కూడా లేనందువల్ల రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని వాయిదా వేసుకున్నట్లయితే, ఆమె గారి కుమారుడు, అంటే ఎవరికైతే ఆమె తదనంతరం ఆమె రాసిన రిజిస్టర్ వీలునామా ద్వారా ఆ ఆస్తి సంక్రమించబోతోందో అతని నుంచి కూడా ఒక సప్లిమెంటరీ అగ్రిమెంటును పొందండి.

" మా అమ్మ మీకు తన ఇంటిని అమ్మి దానికైన మొత్తం డబ్బును పొందినట్లుగా ఆ వ్యవహారం తనకు తెలిసే జరిగినట్లుగా, మీ కోరినప్పటికీ మా అమ్మ అనారోగ్యం వల్ల ఆ భూమిని మీ పేర రిజిస్టర్ చేయలేకపోయామని రాయించుకోండి. అలాగే, మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నప్పుడు తన ఇష్టం మేరకు నా పేరు మీద రిజిస్టర్ వీలునామా రాసి, ఆ వీలునామాలో తన తదనంతరం, ఈ ఇంటిని తనకే చెందేలా రాసిందని, కాబట్టి ఏవైనా పరిస్థితుల్లో మా అమ్మ అనారోగ్యంతో చనిపోయినట్లయితే, ఆ ఇంటిని మీ పేరుమీద రిజిస్టర్ చేస్తాం'' అంటూ తెలిపే ఒక సప్లిమెంటరీ అగ్రిమెంటును పొందండి. అలా చేయకపోతే మునుముందు ఆ ఇంటి విషయమై ఏవైనా పేచీలు రావొచ్చు. ఒకవేళ మీ అమ్మ మీ మాటల్ని అర్థం చేసుకుంటూ, రిజిస్టర్ చేయగల మానసిక దారుఢ్యంతో ఉంటే, రిజిస్టర్ ఆఫీసులో రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ ఆఫీసు సిబ్బందిని ఆమె ఇంటికి తీసుకుని వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఉచితం. ఆ రిజిస్టర్ సేల్- డీడ్‌లో సాక్షిగా ఆమె కుమారుని సంతకం కూడా చేయించండి. మీరు చేయించుకోబోయే దస్తావేజులో ఆమె కొన్ని కారణాల వల్ల తన తదనంతరం ఈ ఇంటిని తనకు చెందునట్లుగా వీలునామా రాసినట్లుగా, కానీ, తాను బతికుండగానే దాన్ని మీకు అమ్ముతున్నందువల్ల ఆ వీలునామా రద్దు అవుతున్నట్లుగా కూడా అందులో విషయాన్ని పొందుపరచండి. ఒకవేళ ఆమె రిజిస్ట్రేషన్ చేయించే మానసిక స్థితిలో ఏ మాత్రం లేనట్లయితే, మీరు తప్పకుండా ఆమె కుమారులనుంచి రిజిస్టర్ వీలునామాను మరియు సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్‌ను రాయించుకోండి. మీరు అలా రాయించుకున్నట్లయితే, మునుముందు మీకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles