Legal advice for land

legal advice for land

legal advice for land

ప్రభుత్వ భూమిలో కూడా వాటా ఇవ్వాలా ?

Posted: 04/21/2014 08:16 PM IST
Legal advice for land

మా అమ్మానాన్నలకు ఆరుగురం సంతానం. అంటే నాకు ఇద్దరు సోదరులు, నలుగురు చె ళ్లెల్లు. నేను పెద్ద వాణ్ని. మాకు స్థిరాస్తులు లేవు. ఒక ఇల్లు ఉండేది. మా నాన్న గారు వ్యవసాయం చేసేవారు. కొన్నాళ్ల పాటు నేనూ వ్యవపాయం చేసినా ఆ తర్వాత ఒక షాపు ప్రారంభించాను. అందరి పెళ్లిళ్లు చేశాం. కొంత కాలం ఉమ్మడి కుటుంబం సజావుగానే నడిచినా, ఆ తర్వాత కొన్ని స్పర్థలు మొదలయ్యాయి. నన్ను ఇంటినుంచి, షాపునుంచి బయటికి పంపేశారు. 1993లో మా ఊరిలోని భూదాన భూములను పంచుతున్నప్పుడు వెళ్లి దరఖాస్తు ఇచ్చాను. తహసీల్‌దారు, భూదాన్ అధికారులు విచారణ జరిపి రెండెకరాల భూమికి పొజిషన్ సర్టిఫికేట్లు, పాస్ బుక్కులు ఇచ్చారు. ఆ తర్వాత కొంత కాలానికి మా అమ్మానాన్నా చనిపోయారు ఇప్పుడు మాకు లభించిన భూముల్లో ప్రభుత్వం కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తోంది. భూములు కోల్పోయిన వారికి పరిహారం అందచేస్తున్నారు. అందులో తమకు కూడా వాటా రావాలనుకుని మా చెల్లెల్లు, త మ్ముడు కేసు వేసే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారు కేసు వేస్తే , ప్రతిగా కేసువేయడానికి న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్థోమత నాకు లేదు ఈ స్థితిలో నేనేంచేయాలో తెలియచేయండి.

మీ నాన్నగారు తనకు వ్యవసాయ భూములేమీ లేనందున వేరే వ్యక్తులకు సంబధించిన వ్యవసాయ భూములను కౌలుపై సాగు చేస్తూ, జీవితం గడుపుతుండే వారని రాశారు. మీరేమో ఒక షాపును ప్రారంభించి మీ నాన్నకు చేదోడుగా ఉండేవారని తెలిపారు. కాలక్రమేణా మీ నాన్న, మీరు కష్టపడి, కొంత స్థిరాస్తిని సంపాదించుకున్నట్లుగా తెలియచేశారు. మీరందరూ ఉమ్మడిగా ఉన్నప్పుడు మీ చెల్లెల్ల పెళ్లి చేసినట్లుగా, తెలియచేశారు. అయితే ఆ పెళ్లి సజావుగా లేకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో తెగదెంపులు చేసుకున్నట్లు కూడా వివరించారు.

అయితే మీకు పెళ్లయి ఇద్దరు పిల్లలు కలిగాక మీ పక్కనున్న ఇంటిని అమ్మకానికి పెట్టినప్పుడు మీరు కొన్నట్లుగా తెలియచేశారు. ఆ ఇంటిని మీరు రిజిస్టర్ దస్తావేజు ద్వారా కొన్నారా? ఎవరి పేరుమీద కొన్నారనే విషయాలేవీ మీరు మీ ఉత్తరంలో తెలియచేయలేదు. ఒక వేళ మీరు రిజిస్టర్ దస్తావేజు ద్వారా మీ నాన్నగారి పేరుమీద కొన్నట్లయితే, అది మీ నాన్నగారి స్వార్జితమైన డబ్బుతో కొననట్లయితే, షాపు నడుపుతూ మీరు మీ నాన్నగారికి ఆర్థికంగా మీరు సహాయం చేసినట్లయితే, మీ నాన్నగారి పేరు మీద కొన్నప్పటికీ అందులో మీకు కూడా హక్కు ఉంటుంది. ఇక పోతే కాలక్రమేణ మీ తమ్ముడు పెద్ద వాడయ్యాక ఏదో కారణంగా మీలో మీకే గొడవలు మొదలై, మీరు విడిగా సంసారం సాగిస్తున్నట్లుగా తెలియచేశారు. మీరు విడిగా ఉంటున్న సమయంలో భూదానం బోర్డు భూముల విషయంలో సర్పంచ్‌గారు, భూదాన్ బోర్డు వారికి మీరిచ్చిన దరఖాస్తును పరిశీలించి, మీకు ఏదైనా భూమి విషయంలో దాన్ని సాగుచేసుకోవడానికి పట్టా ఇచ్చినట్లయితే, ఆ పట్టా భూములను మీరు వేరే వారికి దారాదత్తం చేయడానికి వీలు లేదు.

వాటిని కేవలం మీరు, మీ వారసులు అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంటుంది. వారసులు అంటే మీరు, మీ భార్య, మీ సంతానం, మీ అమ్మానాన్నలు సజీవంగా ఉన్నట్లయితే, వారు అనుభవించడానికి వీలు ఉంటుంది. మీకు భూదాన్ బోర్డు వారు, ప్రభుత్వం వారు ఏదైనా భూమిని అసైన్డ్ చేసినా, పట్టా ఇచ్చినా అట్టి భూమిపై మీ సోదరీ సోదరులకు , ఏ విధమైన హక్కులూ సంక్రమించవు. వాటి పై హక్కుల విషయంలో వారు పేచీ పెట్టి కోర్టును సంప్రదించినా వారికి హక్కులూ సంక్రమించవు. ఇకపోతే, మీరు మీ నాన్నగారు కలిసి జీవిస్తున్నప్పుడు కొన్న ఇంటి విషయంలో మరి షాపు విషయంలో పెద్ద మనుషుల ముందు పరిష్కారం కుదిరి వారు తీసుకుని దాన్ని వేరే వ్యక్తులకు అమ్మినట్లుగా తెలియచేశారు.

అయితే ఆ అమ్మకం రిజిస్టర్ దస్తావేజు ద్వారా జరగాలి. అలా కాకుండా కేవలం పెద్ద మనుషుల సమక్షంలో తీర్మాణం చేయించుకుంటే దానికి చట్టబద్ధత ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కుటుంబ ఆస్తుల విషయంలో మౌఖికంగా గానీ, రిజిస్టర్ లేకుండా సాదా కాగితంమీద రాసుకున్నా గానీ, చట్టం దృష్టిలో అవి చలామణీ అయ్యే కొంత వెసులు బాటు ఉంది. మీరు తెలియచేసినట్లు మీకు భూదాన్ బోర్డు వారు,రెవెన్యూ అదికారులు మీకు పట్టా ఇచ్చినట్లయితే, ఆ పట్టా దస్తావేజులన్నీ మీ పేరుమీదే ఉన్నందువల్ల ఆ భూమి విషయంలో గానీ,పరిహారం విషయంలో గానీ, మీ వాళ్లకు ఏవిధమైన హక్కులూ సంక్రమించవు. మీరు కోర్టులో కేసు వేయడానికి ఆర్థిక స్థోమత లేకపోతే, ప్రతి న్యాయస్థానంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే విభాగం ఉంటుంది. వారిని మీరు సంప్రదిస్తే వారు మీకు ఉచితంగానే ఒక న్యాయవాదిని నియమించి మీకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles