Jagga reddy fire on trs leaders

jagga reddy fire on trs leaders, Congress Jagga reddy fire on TRS, Cong MLA Jagga Reddy Vs TRS leaders harishrao

jagga reddy fire on trs leaders, Congress Jagga reddy fire on TRS, Cong MLA Jagga Reddy Vs TRS leader harish rao

ముగిసిన టీ-సీ ల సమావేశం-రెండుసార్లు తిట్టిన జగ్గారెడ్డి

Posted: 09/19/2013 04:03 PM IST
Jagga reddy fire on trs leaders

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వటంతో టీఆర్ఎస్ నేతలకు పనిలేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. హరీష్ రావు, కేటీఆర్ లు మతి భ్రమించి ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రిని ఒక్కసారి తిడితే ....తాను రెండుసార్లు వారిని తిట్టాల్సి వస్తుందని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాలను చేపట్టి... సీమాంధ్రలో కూడా పర్యటిస్తారని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణపై సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నందున వెనక్కి తగ్గటం సాధ్యం కాదని ఆయన అన్నారు.

 

ముగిసిన సమావేశం

సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ, సీమాంద్ర మంత్రుల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే తాము కోరామని, రాయల తెలంగాణ పై చర్చ జరగలేదని మంత్రి ేరాసు ప్రతాప్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే కలిగే నష్టాలను తెలంగాణ నేతలకు వివరించామన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి సహకరించాల్సిందిగా సీమాంద్ర నేతలకు విజ్నప్తి చేశామని మంత్రి శ్రీదర్ బాబు తెలిపారు. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ వచ్చేలా తీర్పు జరిగిందని, దానికి ప్రత్యామ్నాయం లేదని మంత్రి సారయ్య అన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more