Cm kiran kumar reddy meet on telangana leaders

cm meet non telangana mlas, cm kiran meet non telangana leaders, chief minister n kiran kumar reddy, andhra leaders meet cm kiran,telangana ministers to meet kiran kumar reddy,breaking news, ap politics, political news, andhra news

cm kiran kumar reddy meet on telangana leaders, CM Kiran Reddy to meet non-Telangana MLA

తెలంగాణ మంత్రులతో సిఎం భేటీ?

Posted: 08/03/2013 12:54 PM IST
Cm kiran kumar reddy meet on telangana leaders

రాష్ర్ట ముఖ్యంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు మౌనం విడారు. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంత నేతలతో భేటీ అవుతున్నారు. సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు రాజీనామాల బాట పడుతున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డిగా అండగా తాము ఉంటామని తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెబుతున్నారు. సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సీఎంకు తాము తమదైన పద్ధతిలో సహకరిస్తామని వారు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నెలకొన్న తాజా పరిణమాలపై తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏడుగురు తెలంగాణ మంత్రులు, కేంద్రమంత్రితోపాటు నలుగురు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఆమోదం పొందేలా చూడాలని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. సీమాంధ్రకు రాజధాని నిర్మాణం, వనరుల పంపిణీ వంటి అంశాల్లో తాము సహకరిస్తామని వారు కిరణ్ కు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఇటు తెలంగాణ నేతలో భేటీ అయిన ఆయన అటు సీమాంధ్ర ప్రాంతాల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సాయంత్రం సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజనపై ప్రజలు తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతుండడంతో వాటికి తట్టుకోలేక రాజీనామాల బాట పడుతున్న సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంయమనం పాటించాలంటూ కిరణ్‌ మరోమారు సూచించబోతున్నారు. సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఆ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more