Mim brothers at odds over deal for mlc seat

mim president asaduddin owais, brother akbaruddin, congress candidate, mlc seat, congress candidate ms prabhakar, congress party, cm kiran kumar reddy, sonia gandhi,

mim brothers at odds over deal for mlc seat.Two days after MIM floor leader in the Assembly Akbaruddin Owaisi alleged that a political witch-hunt was launched against his party by N Kiran Kumar Reddy

mim-brothers.gif

Posted: 03/26/2013 05:45 PM IST
Mim brothers at odds over deal for mlc seat

mim brothers at odds over deal for mlc seat

 ఒవైసీ బ్రదర్స్ మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఒకరు కాంగ్రెస్ పార్టీకి  సపోర్టు చేస్తే, మరొకరు కాంగ్రెస్ పార్టీ పై కత్తులు దూస్తున్నారు. సొంత అన్నదమ్ముల మద్య చిచ్చుపెట్టి సైలెంట్ గా తప్పుకుంది కాంగ్రెస్ పార్టీ.  కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని ప్రకటనలు చేసిన  ఎంఐఎం పార్టీ  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.  రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ రంగు పులుముకుంటారో  ఆ పార్టీలోని నాయకులకే అర్థం కాదు. ఎంఐఎం సోదరులు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య 'ఎమ్మెల్సీ ఎన్నిక' అంశం విభేదాలకు దారి తీసినట్లు తెలిసింది. స్థానిక ప్రజా ప్రతినిధుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ ప్రభాకర్‌కు మద్దతు ఇవ్వాలన్న అసద్ నిర్ణయంతో అక్బర్ తీవ్రంగా విభేదించినట్లు సమాచారం. ఈ విషయంలో వారిద్దరి మధ్య ఓ దశలో తీవ్ర వాగ్వాదం కూడా జరిగినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రభాకర్ పేరును ఖరారు చేసిన వెంటనే కొంత మంది కాంగ్రెస్ నాయకులు మజ్లిస్ నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు.

mim brothers at odds over deal for mlc seat

 

 ప్రధానంగా మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్‌లతోపాటు అభ్యర్ధి ప్రభాకర్ స్వయంగా అసదుద్దీన్ ఒవైసీని కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి ఆయన సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పార్టీలో చర్చించిన తర్వాత అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. దీనిపై అక్బర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్, కాంగ్రెస్ పార్టీ కారణంగా తీవ్రంగా నష్టపోయినప్పటికీ తిరిగి అదే పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం అవివేకమని అక్బరుద్దీన్ వాదించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నిర్వాకంతో తాను జైలు పాలయ్యాయని కూడా ఆయన గుర్తు చేశారు. "తెలుగుదేశం పార్టీ మద్దతు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనమే అభ్యర్థిని నిలబెడదాం. అవసరమైతే వైసీపీ కూడా మనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది'' అని అక్బరుద్దీన్ ప్రతిపాదించినట్లు సమాచారం.  అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాల కారణంగా తొందరపడకూడదని, మజ్లిస్ పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పలకడమే మంచిదని తన సోదరుడికి అసదుద్దీన్ సర్దిచెప్పినట్లు తెలిసింది. మొత్తానికి... ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇద్దరు సోదరుల మధ్య కొద్దిసేపు తీవ్ర స్థాయిలో చర్చలు జరిగినట్టు సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp mla kishan reddy fire on cm kiran kumar reddy
Left parties hunger strike at indira park  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more