![]() |
ఈ -వ్యర్థాలపై ఆంక్షలు లేకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వచ్చాయి. ఇప్పుడు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ వ్యర్థాలకు సంబంధించి కఠిన చర్యలకు సిద్ధ మైంది. ఇందుకోసం కఠిన నిబంధనలతో ఒక చట్టం చేసింది. అది ఈ ఏడాది మే నుంచి అమలులోకి రానున్నాయి. ఈ చట్టం ప్రకారం వ్యర్థాల బాధ్యతను ఇకపై ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థలు, డీలర్లే తీసుకోవాలి. కాలం చెల్లిన ఎలక్ట్రిక్ వస్తువులను శాస్త్రీయంగా నిల్వ చేయడంతో పాటు రీ సైక్లింగ్ చేయాలి. సంస్థలు ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయానికి ఏవిధంగానైతే డిస్ట్రిబ్యూటర్ల నెట్‌వర్క్ ను ఏర్పాటు చేసుకుంటాయే అదేవిధంగా కాలం చెల్లిన, పాడైన వాటిని తిరిగి తీసుకోవడానికీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ఈ- వ్యర్థాల లెక్కలు తేల్చే బాధ్యతను పర్యావరణ పరిరక్షణ, పరిశోధన, శిక్షణా సంస్థ (ఈపీటీఆర్ఐ)కు అప్పగించింది. ఈ సంస్థ హైదరాబాద్, విజయవాడ, వి శాఖపట్టణం తదితర నగరాల్లో సర్వే నిర్వహించింది. 2011నవంబర్‌లో లెక్కలను వెల్లడించింది. హైదరాబాద్‌లో ఏటా 3,740 టన్నుల ఈ వ్యర్థాలు వెలువడుతున్నట్లు ఆ లెక్కలు స్పష్టం చేశాయి. వీటిలో అధిక భాగం కంప్యూటర్ వ్యర్థాలేనని తేల్చింది. సెల్‌ఫోన్ వ్యర్థాలు రెండో స్థానంలో నిలిచాయి. విజయవాడలో ఏటా 210 టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా వీటిలో అత్యధిక శాతం టీవీలున్నాయి. విశాఖలో 319 టన్నుల ఈ - వ్యర్థాలు వెలువడుతున్నట్లు తేలింది. ఇక్కడ కూడా టీవీలు, సెల్‌ఫోన్‌ల వ్యర్థాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్రం తాజాగా ప్రకటించిన ఈ- వ్యర్థాల నిబంధనలు అ మలు చేయడం కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈనెల 2న ఈపీటీఆర్ఐతో కలిసి వర్క్‌షాపు నిర్వహించింది. దీనికి ఉత్పత్తిదారుల నుంచి స్పందన కరువైంది. మే నుంచి నిబంధనలు అమలు కానున్నా ఇప్పటి వరకూ ఒక్క ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థ కూడా పీసీబీని సంప్రదించలేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ- వ్యర్థాల రూల్స్ -2012 ఎలా అమలవుతాయో చూడాలి. |
ఈ -వ్యర్థాలపై ఆంక్షలు లేకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వచ్చాయి. ఇప్పుడు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ వ్యర్థాలకు సంబంధించి కఠిన చర్యలకు సిద్ధ మైంది. ఇందుకోసం కఠిన నిబంధనలతో ఒక చట్టం చేసింది. అది ఈ ఏడాది మే నుంచి అమలులోకి రానున్నాయి. ఈ చట్టం ప్రకారం వ్యర్థాల బాధ్యతను ఇకపై ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థలు, డీలర్లే తీసుకోవాలి. కాలం చెల్లిన ఎలక్ట్రిక్ వస్తువులను శాస్త్రీయంగా నిల్వ చేయడంతో పాటు రీ సైక్లింగ్ చేయాలి. సంస్థలు ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయానికి ఏవిధంగానైతే డిస్ట్రిబ్యూటర్ల నెట్‌వర్క్ ను ఏర్పాటు చేసుకుంటాయే అదేవిధంగా కాలం చెల్లిన, పాడైన వాటిని తిరిగి తీసుకోవడానికీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more