బాలయ్య కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ దగ్గరపడుతున్నా కొద్దీ రోజుకో కొత్త వార్త హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ ఒకరోజు ఆలస్యం చేస్తున్నాడని క్రిష్ పై కోపంగా ఉన్న అభిమానులను ఇప్పుడు మరో వార్తతో కంగారుపడుతున్నారు. ఆ మధ్య శాతకర్ణిలో విజువల్స్, ట్యూన్స్ బాలీవుడ్ గ్రాండియర్ మూవీ ‘బాజీరావ్ మస్తానీ’ నుంచి కాపీ కొట్టారన్న వార్త హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
ఇంత తక్కువ టైంలో (79 రోజుల్లో ) సినిమా తెరకెక్కటంపై అనుమానాలు వ్యక్తం చేసిన పలువురు, ట్రైలర్ రిలీజ్ అయ్యాక అందులోని ట్యూన్స్, విజువల్ వర్క్స్, వార్ సీన్లు కాపీ కొట్టారంటూ వార్తలు లేపారు. ఠాగూర్ రీమేక్‌గా తెరకెక్కిన గబ్బర్ ఈజ్ బ్యాక్ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించాడు. ఆ పరిచయంతోనే అందులోని విజువల్ గ్రాఫిక్స్‌ని క్రిష్ వాడుకున్నాడన్న టాక్ వినిపించింది. దీనిపై క్రిష్ క్లారిటీ ఇచ్చాడు. రేయింబవళ్లు తమ టీం కష్టపడటం మూలంగానే ఔట్ పుట్ వచ్చిందని, ఇది తెలుగు జాతి గౌరవమని, అనవసరపు రూమర్లను క్రియేట్ చేయకండంటూ విజ్నప్తి చేశాడు.
అయితే తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ బయటకు రాగా, యుద్ధ సన్నివేశాలు కీలకంగా ఉంటాయని తెలిసింది. ఈ దశలో కాపీ వార్త కూడా నిజమేనన్న ఇంకో వార్త బయలుదేరింది. చరిత్రలో అంతగా పరిచయం లేని ఈ తొలి దేశ చక్రవర్తిపై తెరకెక్కుతున్న సినిమా పై క్రిష్ కాదని వాదన వినిపిస్తున్నా ఇలాంటి పుకార్లు రావటం నిజంగా విచారకరమే.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more