తెలుగులో సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో ఒక ఊపు ఊపిన త్రిష ఇటీవలే ఒక ఇరకాటంలో పడింది. తమిళంలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల హారర్ సినిమాలలో తెగ నటించేస్తోంది. భూలోహం, అరణ్మనై తెలుగులో కళావతి, నాయికి లాంటి హారర్ సినిమాలను గ్యాప్ లేకుండా చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో కోడి, మోహిని అనే సినిమాలను చేస్తోంది ఈ అమ్మడు.
మోహిని సినిమా షూటింగ్ నిమిత్తమై త్రిష అండ్ టీమ్ లండన్ లో ఒక సాంగ్ చిత్రీకరణలో పాల్గొంది. ఈ షూటింగ్ లో త్రిష వెనక ఉన్న డ్యాన్సర్ ఎవరో త్రిష అందాన్ని చూస్తూ మైమరిచిపోయి తన నడుంని, ఇంకా తన అందాలను తన కెమెరాలో బంధించాడట.
ఈ విషయం గమనించిన త్రిష ఆ డ్యాన్సర్ ని చెంప పగలకొట్టి గట్టిగా బుద్ది చెప్పిందట. దాంతో సెట్స్ లో గందరగోళం ఏర్పడింది. మిగతా డ్యాన్సర్స్ అందరూ త్రిష చేయిచేసుకోవడం పై ఘాటుగా స్పందించారట. ఈ అమ్మడికి ఈ మద్య చెయ్యి దురుసు అయ్యిందంటూ వెంటనే క్షమాపణ చెప్తేనే షూటింగ్ అని బెదిరించారట. అయితే, తనని అసభ్యంగా కెమెరాలో షూట్ చేయటం పట్ల త్రిష వెనక్కి తగ్గేది లేదంటూ షూటింగ్ కి తనదైన స్టైల్లో పేకప్ చెప్పి వెళ్లిపోయిందట. దీంతో ఆ సినిమా సాంగ్ షూటింగ్ ఆ రోజుకి వాయిదా పడింది.
ఆ తర్వాత త్రిష కి డ్యాన్సర్స్ కి మద్య పొత్తు కుదరటంతో ఆ డ్యాన్సర్ క్షమాపణ చెప్పినట్లు, త్రిష కూడ చేయిచేసుకున్నందుకు చింతించినట్లు సమాచారం తెలుస్తోంది.
ఏది ఏమైనా లేట్ వయసులో కూడ మరింత అందంగా కనిపిస్తున్న ఏకైక హీరోయిన్ త్రిషేనని, మళ్లీ హారర్ సినిమాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ బిగిన్ చేసినట్లేనని చెప్తున్నారు సినీ పండితులు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more