nagarjuna and raghavendra rao movie first look planing

Nagarjuna and raghavendra rao movie first look planing

akkineni nagarjuna next movie, nag next, nag hathiram baba getup, raghavendrarao upcoming, hathiram baba nagarjuna, director sukumar formula, dirctor raghavendra rao

nagarjuna and raghavendrarao planing hathiram baba getup and frist look release. they are following the director sukumar formula in this film.

'సుకుమార్' ఫార్ములా ఫాలో...!

Posted: 06/11/2016 12:25 PM IST
Nagarjuna and raghavendra rao movie first look planing

టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరోసారి అక్కినేని నాగార్జున వెంకటేశ్వరస్వామి భక్తుడుగా తెరకెక్కనున్న సినిమా 'బాబా హథీరామ్'. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని చాలా పకడ్భందీగా తయారుచేస్తున్నాడు దర్శకేంద్రుడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభానికి ముందే నాగార్జున తో బాబా గెటప్ వేయించి ఫోటో షూట్ చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తోందట.

తలపాగా, తెల్లగడ్డం చేతిలో చిన్న త్రిశూలం తో నాగార్జునతో గెటప్ వేయించి ఫోటోషూట్ చేసేందుకు రెడీ అయిపోయారు. దీనికి సంబంధించిన చిత్రాలను త్వరలోనే సోషల్ సైట్స్ ద్వారా పబ్లిక్ లోకి తీసుకెళ్లి రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుంటారట. నిజానికి ఈ ఐడియా గతంలో డైరెక్టర్ సుకుమార్ వేసి ఫలితాన్ని సంపాదించాడు. నాన్నకు ప్రేమతో సినిమా స్టార్ట్ చేయడానికి ముందే జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఫోటో షూట్ చేసి దాన్ని సోషల్ సైట్స్ లో పెట్టాడు. దానికి వచ్చిన విపరీతమైన రెస్పాన్స్ ని చూసాక మంచి కాన్ఫిడెంట్ తో సినిమా తీసి సక్సెస్ సాధించాడు.
ఇప్పుడు కూడ రాఘవేంద్రరావుగారు ఈ విషయంలో సుకుమార్ నే ఫాలో అవుతున్నాడట.

ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులను కూడ జెకె భారవి ఆధ్యర్యంలో పూర్తిగా రెడీ అవుతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అతి త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్తుందని, దీనికోసం ప్రత్యేకించి ఇప్పటికే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు కొన్ని సెట్స్ కూడ రూపొందించారని తెలుస్తోంది. ఇక ఆధ్యాత్మికానికి కాస్తంత శృంగారాన్ని మేళవించే దర్శకుడు రాఘవేంద్రరావు ఈ సినిమాని ఎలా తీయబోతున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.   
 
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni nagarjuna  hathiram baba  raghavendrarao  director sukumar  nagarjuna  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more